YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఏడాదిలోగా రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇండ్ల స్ధలాలు,డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు

ఏడాదిలోగా రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇండ్ల స్ధలాలు,డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు
రాష్ట్రంలోని పలు పత్రికలు,ఎలక్ర్టానిక్‌ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఏడాదిలోగా ఇండ్ల స్ధలాలు,డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇవ్వన్నున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ,దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో మండల ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మంచిర్యాల జిల్లా ఉత్తమ జర్నలిస్టు సన్మాన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజర య్యారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ అర్హులైన పాత్రికేయుడికి అక్రిడేషన్,హెల్త్‌కార్డును,బస్‌పాస్‌లు ఇప్పిస్తున్నామని తెలిపారు. నిస్వార్ధంతో సమాజ సేవే లక్ష్యంగా పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెల్త్‌కార్డును వర్తింపజేసి తమ ఔదార్యాన్ని చాటారన్నారు. ఇప్పటికే పది వెల్‌నెస్‌ సెంటర్లను ఏర్పాటుచేశామని త్వరలో అన్ని జిల్లా కేంద్రాల్లో ముఖ్యమైన పట్టణాలలో వెల్‌నెస్‌ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. లక్షెట్టిపేట పాత్రికేయులు పలు డిమాండ్లతో వినతి పత్రాన్ని సమర్పించారు.

Related Posts