YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నాగబాబు మంత్రిపదవి

నాగబాబు మంత్రిపదవి

విజయవాడ, జూలై 23, 
జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు మంత్రి పదవిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. నాగబాబు మంత్రి పదవిపై క్లారిటీ ఇచ్చారు. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చిన సంగతి తెలిసిందేజనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి అంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నాగబాబుకు మంత్రి పదవి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎన్నికల సమయంలో అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని నాగబాబు భావించారు. అయితే కూటమి పొత్తుల లెక్కల్లో ఆ స్థానం బీజేపీకి వెళ్లగా.. సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీగా గెలుపొందారు. అయితే పోటీ చేసే అవకాశం దక్కకపోయినప్పటికీ.. జనసేన అభ్యర్థుల తరుఫున, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి నాగబాబు కృషి చేశారు.ఇక ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపొంది అధికారంలోకి రావటంతో నాగబాబుకు నామినేటెడ్ పోస్టులు ఇస్తారంటూ వార్తలు వచ్చాయి. టీటీడీ ఛైర్మన్ చేస్తారని ఒకసారి.. మంత్రి పదవి ఇస్తారని మరోసారి ఇలా రకరకాల కథనాలు వచ్చాయి. చివరకు ఈ కథనాలకు చెక్ పెడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామంటూ టీడీపీ ప్రకటన కూడా ఇచ్చింది. 2024 డిసెంబర్ నెలలో ఏపీ నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ప్రకటించిన సందర్భంలో.. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు టీడీపీ ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి నాగబాబును రాజ్యసభకు పంపుతారని వార్తలు రాగా.. బీజేపీ నుంచి ఆర్. క్రిష్ణయ్య, టీడీపీ నుంచి బీద మస్తాన్‌రావు, సానా సతీష్‌లను రాజ్యసభకు పంపారు. దీంతో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని టీడీపీ ప్రకటించింది.అయితే ఈ ప్రకటన వచ్చి సుమారు ఏడు నెలలు గడుస్తున్నా నాగబాబుకు మంత్రి పదవి మాత్రం దక్కలేదు. అయితే ఈలోపే నాగబాబును ఎమ్మెల్సీని చేశారు. దీంతో మంత్రివర్గంలోకి మార్గాన్ని సుగమం చేసింది కూటమి. అయితే ఎప్పుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారనే దానిపై తాజాగా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు.ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ కళ్యాణ్ పెదవి విప్పారు. నాగబాబుకు మంత్రి పదవిపై ఇప్పటిదాకా చర్చ జరగలేదన్న పవన్ కళ్యాణ్.. ఈ అంశం గురించి సీఎం చంద్రబాబు ఇప్పటికే తన నిర్ణయం వెల్లడించారని అన్నారు. అయితే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది తానేనని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవన్న జనసేనాని.. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు చెప్పుకొచ్చారు.

Related Posts