YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బ్యాంకుల్లో పెరిగిపోతున్న మోసాలు

బ్యాంకుల్లో  పెరిగిపోతున్న మోసాలు
సాంకేతిక‌త పెరుగుతున్న కొద్దీ ఆన్‌లైన్ క్రెడిట్‌కార్డు,డెబిట్ కార్డు ఆధారిత మోసాలు పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో మోసం, చీటింగ్ కేసులు ఎక్కువ‌య్యాయి. వీటికి సంబంధం లేకుండా బ్యాంకులు సైతం వినియోగ‌దారుల విష‌యంలో మోసాల‌కు పాల్ప‌డుతున్నాయి. ఎలా అంటారా? ఏడేళ్ల‌లో బ్యాంకులు త‌మ‌ను మోసం చేశాయని 4 ల‌క్ష‌ల‌కు మందికి పైగా ఫిర్యాదు చేశారంటే బ్యాంకులు ఎంత‌లా క‌స్ట‌మ‌ర్ల‌ను మోసం చేస్తున్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్ ఉప‌యోగించుకుని 4ల‌క్ష‌ల‌కు పైగా ఖాతాదారులు ఆయా బ్యాంకుల‌పై ఫిర్యాదు చేశారు. త‌మ ఖాతాలు క్లోజ్ చేసేందుకు నిరాక‌రించ‌డం, పేమెంట్లు తీసుకోవ‌డానికి అంగీక‌రించ‌క‌పోవ‌డం(త‌ద్వారా పెనాల్టీలు క‌ట్టాల్సి రావ‌డం), ఖాతా నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి క‌స్ట‌మ‌ర్ల‌తో వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో 2010 ఏప్రిల్ నుంచి 2017 మార్చి 31 మ‌ధ్య 4,00,000కు పైగా ఖాతాదారులు బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్ ద్వారా బ్యాంకు యాజ‌మాన్యాల‌పై ఫిర్యాదు చేశారు. అంటే దాదాపు ప్ర‌తి గంట‌కూ 11 అన్న‌మాట‌. మార్చి 31,2018 నాటికి మ‌రో ల‌క్ష ఫిర్యాదులు వ‌చ్చి ఉంటాయ‌ని ఈ వ్య‌వ‌హారంతో సంబంధం ఉన్న వ‌ర్గాలు అంటున్నాయి. అయితే అధికారిక లెక్క‌లు మాత్రం వెల్ల‌డ‌వ్వాల్సి ఉంది. ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం ఖాతాదారుడు ఖాతా తెరిచిన‌ప్పుడు అంగీక‌రించిన నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని 38%, ఏటీఎమ్,డెబిట్,క్రెడిట్ కార్డుల‌కు సంబంధించి 20% ఎక్కువ భాగం ఫిర్యాదులు ఉంటున్న‌ట్లు తెలుస్తోంది. పెన్ష‌న్ల‌కు సంబంధించి 8శాతం వ‌ర‌కూ ఫిర్యాదుల న‌మోదు జ‌రిగింది. ఆర్బీఐ స‌మాచారం ప్ర‌కారం 2016-17లో బ్యాంకుల‌పై వ‌చ్చిన ఫిర్యాదులు అంత‌కుముందు ఏడాదితో పోలిస్తే 27% పెరిగాయి. 

Related Posts