YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్ కైవసమైన జయనగర్

కాంగ్రెస్ కైవసమైన జయనగర్
కర్ణాటక రాజధాని బెంగళూరు పరిధిలోని జయనగర అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సౌమ్యారెడ్డి 2,878 ఓట్ల తేడాతో తన సమీప బీజేపీ అభ్యర్థి ప్రహ్లాదపై విజయం సాధించారు.. ఇతరులంతా కలిసి 1,591 ఓట్లను మాత్రమే పొందగలిగారు. ఈ నెల 11న ఇక్కడ పోలింగ్ జరగింది. సార్వత్రిక ఎన్నికలతో పాటే జయనగర అసెంబ్లీ ఎన్నిక కూడా జరగాల్సింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే, పోటీలో ఉన్న అభ్యర్థి హఠాత్తుగా మరణించడంతో ఎన్నిక వాయిదా పడింది.దక్షిణ బెంగళూరులోని జయనగర్‌ నియోజకవర్గంలో 70 శాతం మంది మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారున్నారు. అంతకుముందు కాంగ్రెస్‌కు కంచుకోటలా ఉన్న జయనగర్‌ స్థానంలో 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి కూడా అయిన విజయ్‌కుమార్‌ అకస్మిక మరణంతో ఇక్కడ మే 12న జరగాల్సిన ఎన్నిక జూన్‌ 11కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. గడిచిన పదేళ్లుగా జయగనర్‌లో బీజేపీదే ఆధిక్యం. గతంలో ఇక్కడి నుంచి నాలుగుసార్లు గెలుపొంది, డీలిమిటేషన్‌ తర్వాత వేరే స్థానానికి వెళ్లిపోయిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆర్‌. రామలింగారెడ్డి.. ఈ దఫా జయనగర్‌ నుంచి తన కూతురు సౌమ్య రెడ్డికి టికెట్‌ ఇప్పించుకున్నారు. ఇప్పటికే జేడీయూ-కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన దరిమిలా మిత్రపక్షాలకు చెందిన పెద్ద నాయకులెవరూ ప్రచారానికి రాలేదు. దీంతో రామలింగారెడ్డే అంతా తానై వ్యవహరించారు. కాంగ్రెస్‌కు 54,457 ఓట్లు నమోదవ్వగా.. బీజేపీకి 51,568 ఓట్లు వచ్చాయి.జయనగర్‌లో పార్టీ ఓటమిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప తీవ్రఅసహనానికి గురయ్యారు. మీడియాతో మాట్లాడకుండా ముఖంచాటేశారు. జయనగర్‌ ఎంపీ, కేంద్ర మంత్రి అనంతకుమార్‌ వల్లే పార్టీ ఓడిపోయిందని యడ్డీ తన అనుచరులతో అన్నట్లు సమాచారం. ప్రచార బాధ్యతలు తీసకున్న అనంతకుమార్‌.. స్థానిక నాయకత్వాన్ని పట్టించుకోకుండా ఇష్టారీతిగా వ్యవహరించారని, ఎగువ మధ్యతరగతి ఓట్లు అధికంగా ఉన్న జయనగర్‌లో బీజేపీ సునాయాసంగా గెలుస్తుందని భావించినా, చేదు ఫలితాన్ని చవిచూడాల్సి వచ్చిందని యడ్డీ కస్సుబుస్సులాడినట్లు తెలిసింది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మాజీ హోం మంత్రి రామలింగారెడ్డి తనయ సౌమ్యారెడ్డి పోటీలో ఉండటంతో ఈ నియోజకవర్గం ఫలితం మరింత ఆసక్తిదాయకంగా మారింది. ఒక దశలో సౌమ్యారెడ్డి భారీ మెజారిటీనే సాధించారు. ఆమె ఆధిక్యం 17వేల ఓట్ల వరకూ కూడా వెళ్లింది. అయితే చివర్లో బీజేపీ పుంజుకుంది. అయితే విజయం మాత్రం సౌమ్య వైపే మొగ్గింది. ఈ నియోజకవర్గంలో జేడీఎస్ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికింది. ఈ విజయంతో కర్ణాటకలో కాంగ్రెస్ బలం మరో సీటు పెరిగింది. 

Related Posts