
హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుంటే బి.ఆర్.ఎస్ కు మింగుదు పడటం లేదని ప్రబుత్వ విప్ బిర్ల ఐలయ్య ఎద్దేవా చేశారు. శాసనసభ ఆవరణలో మీడియా తో మాట్లాడిన ఆయన తమ నేత రాహుల్ గాంధీ వరంగల్ లో బీసీ డిక్లరేషన్ ను విడుదల చేసిన సందర్భంగా ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు.అధికారం కోసమే విపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డురామని అన్నారు.ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బి.ఆర్.ఎస్ పార్టీకి లేదని అన్నారు.