
హైదరాబాద్
ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పీకర్ ను అవమానించలేదు. సభ మీ ఒక్కరిది కాదు - సభ అందరిదీ అన్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం అయన అసెంబ్లీలో మీడియాతో మాట్లాడారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదు. మీ ఒక్కరిదీ అనే పదం అన్ పార్లమెంట్ పదం కాదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసన చేశారో తెలీదు. సభను ఎందుకు వాయిదా వేశారో తెలీదు. కాంగ్రెస్ డిఫెన్స్ లో పడింది.. స్పీకర్ ను కలిసి సభా రికార్డులు తీయాలని కోరడం జరిగింది. స్పీకర్ గారిని అగౌవరపరిచే విధంగా జగదీష్ రెడ్డి మాట్లాడలేదు. జగదీష్ రెడ్డి మాట్లాడిన సభ వీడియో రికార్డును స్పీకర్ ని అడిగాం. 15 నిమిషాలయినా వీడియో రికార్డును స్పీకర్ కార్యాలయం తెప్పించలేదు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాట్లాడకుండా బ్లాక్ చేశారని అన్నారు.