
శ్రీకాకుళం
వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అవగాహన ర్యాలీని చేపట్టారు.ఈ ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ప్రారంభించారు.ప్రపంచంలో రోజురోజుకి కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారని వైద్యులు తెలిపారు. దీనిని ముందుగానే గుర్తిస్తే చికిత్స అందించడం చాలా సులువన్నారు. శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం, విపరీతమైన పెయిన్ కిల్లర్స్ వినియోగించడం వల్ల కిడ్నీ వ్యాధులు వస్తాయని వైద్యులు వెల్లడించారు. మధుమేహం, ఊబకాయం, బీపీ ఉన్నవారు ప్రతి మూడు నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు తెలిపారు.