
విశాఖపట్టణం, మార్చి 15,
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త నేషనల్ హైవేలు, గ్రీన్ ఫీల్డ్ హైవేల పనువు వేగంగా సాగుతున్నాయి. కొన్ని హైవేల పనులు ముగింపు దశకు చేరాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు కీలమైన, మెరుగైన రవాణా సౌకర్యం కోసం చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. ఈ హైవే విశాఖ - రాయపూర్ మధ్య ఆరు వరుసలగా ఎకనామిక్ కారిడార్ ఎక్స్‌ప్రెస్ హైవే 130 సీడీగా నిర్మాణం అవుతోంది. రూ.20 వేల కోట్లతో ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ నిధులతో.. ఎలాంటి అడ్డంకులు లేకుండా దూరాభారాన్ని తగ్గించేందుకు కేంద్రం ఈ హైవే నిర్మాణ పనులు చేపట్టింది. త్వరలోనే నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి.ఈ నేషనల్ హైవే ఛత్తీస్‌గఢ్ రాయపూర్‌లోని అభన్‌పూర్ దగ్గర గ్రీన్‌ఫీల్డ్ హైవేగా మొదలవుతుంది.. అక్కడి నుంచి ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లా కొత్తవలస మండలం సంతపాలెం మీదుగా అనకాపల్లి జిల్లా సబ్బవరం దగ్గర ముగియనుంది. మూడు జిల్లాల పరిధి (విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి)లో రూ.3,215.81 కోట్ల విలువైన పనులు చేపట్టారు. ఈ క్రమంలో మూడు జిల్లాల్లో ఇంటర్ ఛేంజింగ్ ఫ్లైఓవర్లు నిర్మించారు. వీటితో గ్రీన్ ఫీల్డ్ హైవే నుంచి వాహనాలు మిగతా రోడ్లలోకి, హైవే పైకి వెళ్లడానికి వీలుగా ఉంటుందంటున్నారు. రాయపూర్-విశాఖ మధ్య దూరం 590 కి.మీ ఉంటే.. గ్రీన్‌ఫీల్డ్ హైవేతో 464.662 కి.మీకు తగ్గుతాయంటున్నారు.ఈ హైవేతో ప్రయాణ సమయం 14 గంటల నుంచి 9 గంటలకు తగ్గుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఉత్తరాంధ్ర నుంచి సాధారణ ప్రయాణికులతో పాటు వాణిజ్య వాహనాలకు ఉపయోగకరంగా ఉంటుంది అంటున్నారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధితో పాటుగా ఆ చుట్టుపక్కల భూముల్లో ధరల పెరిగాయంటున్నారు. ఈ హైవేతో విశాఖపట్నంలో రెండు పోర్టులతో జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్గో కార్యకలాపాలకు వీలవుతుంది అంటున్నారు. రెండు పొరుగు రాష్ట్రాలతో పాటు విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధికి దోహద పడుతుందని చెబుతున్నారు. ఈ హైవే పనులు త్వరలోనే పూర్తవుతాయని.. త్వరలోనే రాకపోకలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.