
హైదరాబాద్
అసెంబ్లీలో బిఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్ మీడియా తో మాట్లడారు. 70 వేల కోట్ల ఆదాయం తగ్గిందని సీఎం ఒప్పుకున్నారు. తెలంగాణ రైజింగ్ అంటూనే ఈ తగ్గింపు ఏమిటి? ఇది ముమ్మాటికి తెలంగాణ ఫాలింగని కేటీఆర్ అన్నారు. ఇం తకంటే రాష్ట్రానికి ఘోరమైన అవమానం ఇంకోటి ఉండదు. బడ్జెట్ లో 71 వేల కోట్ల రూపాయల తగ్గింపు దారుణం. లంగాణలో వ్యవసాయం, పెట్టుబడులు, పరిశ్రమలు పెరుగుతున్నాయని ప్రభుత్వం గొప్పగా చెప్తుంటే మరి అదాయం ఏట్లా తగ్గింది?బంగారం లాంటి రాష్ట్రాన్ని అప్పజెప్పితే, కాన్సర్ అంటూ మాట్లాడి రేవంత్ సర్వనాశనం చేశాడు.ఏఏ రంగాల్లో వృద్ధి పెరిగిందో బడ్జెట్ లో చెప్పాలి… దానితో వచ్చే అదాయం పెరిగిన తీరు చెప్పాలి. బడ్జెట్ కంటే ముందే నేరాన్ని అంగీకరించి అప్రూవర్ గా రేవంత్ మారారు. ప్రభుత్వం పూర్తి అట్టర్ ప్లాఫ్ అని సీఎం స్వయంగా ఒప్పుకున్నారు. ఎవరైనా ముఖ్యమంత్రి ఇండ్లు కడతారు... కానీ, కూలగొడతారా? ఆదాయం పెంచే తెలివి ఈ ప్రభుత్వానికి అస్సలు లేదు. గాల్లో మేడలు కట్టడం లేదని, వాస్తవిక బడ్జెట్ పెడ్తున్నామని భట్టి విక్రమార్క గొప్పగా చెప్పారు. ఇన్నాళ్లు మేము చెప్పిందే నిజమైందని ఒప్పుకున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి సీఎం విధానాలే కారణమని అన్నారు.
కేసీఆర్ పై ద్వేషంతో కాళేశ్వరం బంద్ పెట్టి వ్యవసాయం నాశనం చేశారు. రాష్ట్రం అన్ని రంగాల్లో విఫలమైనది అని చెప్పినప్పుడు వినలేదు. బడ్జెట్ కోతతోనే అదే నిజమైంది. రేవంత్ ఏడాది కాలంగా చేసిందంతా నెగటివ్ పాలిటిక్స్, అక్రమ నిర్భందాలు, తెలంగాణను కాన్సర్ అంటూ రాష్ట్ర పరువు తగ్గించడం వంటి అడ్డమైన మాటల వల్లనే తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని అన్నారు.
రేవంత్ పాలనపై కెటిఅర్ మాట్లాడుతూ రేవంత్ వంటి పిచ్చోడి చేతిలో తెలంగాణ రాయి అయిపోయింది. ముఖ్యమంత్రి అయిన మొదటి ఏడాదిలోనే రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిండు అనదానికి ఇదే నిదర్శనం. మొదటి సంవత్సరం పరీక్షలో ముఖ్యమంత్రి దారుణంగా విఫలమయ్యాడు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైంది. ఎలాంటి ఆర్ధిక మాంద్యం లేకుండానే, కోవిడ్ వంటి సంక్షోభం లేకుండానే ఆర్థిక పరిస్థితి దిగజారింది.
కేంద్రంతో మంచిగా ఉన్నానని చెప్తున్న రేవంత్ రెడ్డి రాష్ట్రానికి అదనంగా తెచ్చింది ఏమిటి? రేవంత్ రెడ్డి డీల్లీ పర్యటనల వలన కేంద్రం నుంచి తీసుకొచ్చి నిధులు, చేసిన లాభం ఏమిటి? ముఖ్యమంత్రి ఫెయిల్ అయినట్లు నేరుగా చెప్పాడు. బడ్జెట్లో కోత అంటే ఇన్ని రోజులు మేము చేసిన విమర్శలు అన్నీ నిజమే. కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో, పంటలు ఎండబెట్టడంతో ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం నుంచి కాంట్రిబ్యూషన్ తగ్గింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో ఆర్థిక వ్యవస్థ మరింతగా దిగజారింది.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పట్టణాలు, గ్రామాల్లో దిగజారడానికి కారణం పూర్తిగా రేవంత్ రెడ్డి మాత్రమే నని అన్నారు.
ఢిల్లీకి 40 సార్లు కాకపోతే 400 సార్లు పోయి ప్రధానమంత్రి మోడీ, రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకో, మాకేం సమస్య లేదు, కానీ తెలంగాణకి ఎన్ని నిధులు తెచ్చినావో చెప్పు? కేంద్రంతో సఖ్యతతో ఉండి సాధిస్తామని అన్నారు... ఏం సాధించారు? తెలంగాణ ప్రజలు విచక్షణతో ఆలోచించి రెండుసార్లు మాకు అవకాశం ఇచ్చినారు, కాబట్టి తెలంగాణ బలంగా నిలబడింది. రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి తో సమైక్యాంధ్ర పాలకులు అన్న మాటలు నిజమవుతున్నాయి. తెలంగాణకి నాయకత్వ లక్షణాలు లేవు, చేతకాదు, పరిపాలన చేయడం రాదన్న ఆరోపణల్ని తన పాలనతో రేవంత్ రెడ్డి నిజమే అని నిరూపిస్తున్న ట్టు కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి 2014లో గనుక ఉండుంటే తెలంగాణ విఫలరాష్ట్రంగా మిగిలిపోయేది. మా నాయకుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క బట్టలు విప్పి అసెంబ్లీలో నిలబెట్టాడు.
ఓవర్సీస్ స్కాలర్ షిప్పులకు సంబంధించిన ప్రభుత్వం చేసిన న్యాయాన్ని అసెంబ్లీలో ఎండగట్టాడు. ఏడువేల మందికి పైగా విద్యార్థులు, తెలంగాణ బిడ్డలు విదేశాలకు చదవుకోవడానికి వెళ్లి బాగా ఇబ్బంది పడుతున్నారు. రేవంత్ రెడ్డికి గాసిప్స్ మీద తప్ప గవర్నెన్స్ మీద దృష్టి లేదు.రేవంత్ ముఠా టిడిఅర్ స్కాం చేయబోతున్నది రేవంత్ టిడిఅర్ పైన మాట్లాడాలి. భూములు అమ్మకూడదని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఇప్పుడెందుకు వస్తలేడు..గతంలో అక్కడికి వచ్చి ఫోజులు కోట్టి పోయిండు కదా? రాహులు ఎందుకు స్పందించడం లేదు. రాహుల్ స్పందించాలని అన్నారు.