
హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నయ్. అంటే ముందు చూపులేని ఈ సన్నాసి, సోయిలేని కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎండల వలన పంటలు ఎండిపోతున్నాయని ముఖ్యమంత్రి చేతకాని మాటలు చెబుతున్నాడు…దానికి ముమ్మాటికి కారణం రేవంత్ రెడ్డినే. రేవంత్ రెడ్డి చేతకానితనం, తెలివి లేని తనం, సాగునీటి నిర్వహణ ప్రాజెక్టుల నిర్వహణ చేయలేని చేతకాని లేనితనం వల్లనే పంటలు ఎండిపోతున్నాయి. తుల పట్ల, రైతాంగం పట్ల ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయి మొద్దు నిద్ర పోతున్నది కాబట్టే పంటలు ఎండిపోతున్నాయి. ఎండిపోయిన ప్రతి ఎకరానికి 25 వేల రూపాయల చొప్పున పంట నష్ట పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము. ఎండిన ప్రతి ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. ఈ మేరకు రైతన్నలకు నష్టపరిహారం ఇచ్చేందుకు ఈ బడ్జెట్ లోనే నిధులను కేటాయించాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.