YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్లనే రాష్ట్రంలో కరువు

కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్లనే రాష్ట్రంలో కరువు

హైదరాబాద్
శాసనమండలి ఆవరణలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. వర్షాలు సమృద్ధిగా పడ్డాయి నీళ్లు ఉన్నయి ఎండల వల్ల పంటలు ఎండుతున్నయి అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సిగ్గు చేటు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వాటర్ మేనేజ్మెంట్ తెలియక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేసీఆర్  మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపారు. కాంగ్రెస్ పాలనలో ఆయకట్టు కింద ఉన్న పొలాలు కూడా ఎండిపోతున్నాయి. మార్చి లోనే ఇలా ఉంటే ఏప్రిల్ మే లో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయడు  10వేల క్యూసెక్కుల నీళ్లు ఎత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్లనే రాష్ట్రంలో కరువు వచ్చింది. హైద్రాబాద్ లో వాటర్ ట్యాంకర్లు పెరిగాయి. కేసీఆర్  రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టించారు. కేసీఆర్  మీద కోపంతో ఆ నీళ్లు వాడుకోక పోవడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఉన్న నీటి వనరులు వాడుకొని రైతులకు నీళ్లు ఇవ్వాలి. రైతుల పక్షాన బీఆర్ఎస్  పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని అన్నారు.

Related Posts