
హైదరాబాద్
రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా ఉందని మంత్రి కొండ సురేఖ అన్నారు. ఉపాధి కల్పనకు ఊతం ఇస్తూ... మహిళా సంక్షేమం, యువత, దళితులు, గిరిజనుల సంక్షేమానికి దిక్సూచీలా ఉంది.యావత్ తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల ఆకాంక్షలకు అద్దం పట్టేలా బడ్జెట్ను భట్టి విక్రమార్క రూపొందించడం ప్రశంనీయం. సవాళ్ళపై స్వారీ చేస్తూనే... రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ ప్రాంత ప్రజల ఆర్ధిక స్ధిరత్వానికి బాటలు వేస్తుంది. అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క, . శాసనమండలిలో ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు కి అభినందనలని అన్నారు.