
హైదరాబాద్
దేశంలోని చాలా రాష్ట్రాల్లో రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పేదలు అనుభవించాల్సిన ఫలాలు ధనికులు అనుభవిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. వెంటనే అనర్హుల రేషన్ కార్డులను రద్దు చేయాలని జస్టిస్ సూర్యకాంత్,ఎన్. కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. దేశంలో దాదాపు 80 శాతం మంది నిరుపేదలు ఉన్నారని వారందరికీ ఆహార భద్రత ఎంతో అవసరమని పేర్కొంది.