
హైదరాబాద్
రెండు లక్షల రూపాయల రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, భారత రాష్ట్ర సమితి శాసనసభ సభ్యులు, మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు నల్లబ్యాడ్జీలతో అసెంబ్లీ సమావేశాలకు హాజరై నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయకుండా మాట తప్పిందని సభలో నినాదాలు చేశారు.“రుణమాఫీ బూటకం, కాంగ్రెస్ నాటకం!” “రెండు లక్షల రుణమాఫీ అరకొర, కాంగ్రెస్ కొరకొర!” “రెండు లక్షల రుణమాఫీపై మాట తప్పిన కాంగ్రెస్ డౌన్ డౌన్!” అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్దపెట్టున నినదించారు.
ఇచ్చిన మాట ప్రకారం రైతులకు న్యాయం చేయాలని, రుణమాఫీని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.