YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అవినీతిని సహించేది లేదు.

అవినీతిని సహించేది లేదు.

వరంగల్
సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో ఎలాంటి అవినీతిని సహించేది లేదని ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ జిల్లా రిజిస్టర్ దాసరి ఫణిందర్ అన్నారు బుధవారం ఆయన ప్రజా క్రాంతి పత్రికతో మాట్లాడారు ఉమ్మడి జిల్లాలో ఉండబడిన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను అవినీతికి దూరంగా ఉంచడం కోసం స్టాంప్లు రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు ఎక్కువగా ప్రయత్నిస్తూన్నట్లు ఆయన తెలిపారు ఆ క్రమంలో జిల్లాలో ఉండబడిన అన్ని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను తనిఖీలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న సబ్ రిజిస్టర్లు ఇతర సిబ్బంది ఎలాంటి అవినీతికి పాల్పడిన కఠినమైన శిక్షలు ఉంటాయి అన్నారు రిజిస్ట్రేషన్ చేసే సమయాలలో సబ్ రిజిస్టర్లు నిజాయితీగా ఉండిన వాటిని చేయాలని ఆయన తెలిపారు మధ్యతళారులు కొంతమంది పనిగట్టుకుని అధికారులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఆ క్రమంలో అక్కడ పనిచేస్తున్న సబ్ రిజిస్టర్లు వారి వలలో పడవద్దని పేర్కొన్నారు ఇటీవల కొంతకాలంగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న సబ్ రిజిస్టర్లు కిందిస్థాయి సిబ్బంది అక్రమార్కుల వలన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జైలు పాలు అవుతున్నారని జిల్లా రిజిస్టర్ తెలిపారు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు చెప్పిన విధంగా కింది స్థాయిలో పనిచేస్తున్న సబ్ రిజిస్టర్లు ఆ సూచనలు పాటిస్తూ పనిచేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు మధ్యదళారుల మాటలు నమ్మి సబ్ రిజిస్టార్  చెప్పి తప్పుడు దృవపత్రాలు సమర్పించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు అలాంటివారిని కార్యాలయం సమీపంలోనికి రావని వద్దని ఆయన సబ్ రిజిస్టార్లను కోరారు కార్యాలయంలో ఎలాంటి పైరవీలు లేకుండా పారదర్శకంగా ఉండటం కోసం తాను ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు అవినీతికి పాల్పడిన అధికారులను కాపాడే ప్రయత్నాలు ఎవరు చేయరని ఆయన అన్నారు అవినీతికి పాల్పడితే ఉద్యోగ భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు అదే విధంగా అవినీతి కార్యక్రమాలలో పాల్గొన్న అధికారులను జైలు పాలై వారి కుటుంబం అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని హితవు పలికారు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అవినీతి రైతంగా ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేసిన వారు అవుతాం అని ఆయన అన్నారు ప్రజల కోసం పనిచేసినప్పుడు ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన అధికారులుగా ప్రజల మనసుల్లో చిరకాలం ఉండే అవకాశం ఉందని ఆయన తెలిపారు తాను పనిచేసిన కాలంలో ఎక్కడ ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు గతంలో తాను అదిలాబాద్ జిల్లా రిజిస్టర్ గా కరీంనగర్ ఆడిట్ రిజిస్టర్ గా వరంగల్ ఉమ్మడి జిల్లా ఆడిట్ రిజిస్టర్ గా పనిచేసే ప్రస్తుతం వరంగల్ జిల్లా రిజిస్టర్ గా తను విధులను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Related Posts