
తాడేపల్లి:
ఉండవల్లిలో రాజమండ్రి గోవిందు కుటుంబానికి మంత్రి నారా లోకేష్ శాశ్వత ఇళ్ళ పట్టా అందజేసారు. మన ఇల్లు - మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో 3 వేల ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. గురువారం మంత్రి మొదటి పట్టా పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ గతంలో జేసిబి పాలన చూశాం. రాష్ట్రంలో ఎన్డీఏ పాలనలో మొదటి ఇళ్ల పట్టా ఉండవల్లి గ్రామంలో ఇవ్వడం జరిగింది. ప్రజలు తాము నివసిస్తున్న చోటే ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ఆనాడు కోరారు. కోరిన విధంగానే బట్టలు పెట్టీ పసుపుకుంకుమతో ఇళ్ళ పట్టాలు ఇస్తున్నాం. 2019 నుంచి 2024 వరకు సొంత నిధులతో మంగళగిరిలో 26 రకాల కార్యక్రమాలు చేపట్టాను. గడచిన ఎన్నికల్లో మంగళగిరిలో చరిత్ర తిరగరాసీ గెలిచానని అన్నారు.
ఇండియాలోనే గొప్పగా మంగళగిరినీ అభివృద్ది చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. నా లక్ష్యం ఒక్కటే ఏపిలోనే అన్నీ రంగాల్లో మంగళగిరి మొదటి స్థానంలో ఉండాలి. హిందూపురంలా మంగళగిరిని టీడీపీకి కంచుకోటలా తయారు చేస్తా. నేను మంగళగిరిలో గెలిస్తే ఇళ్లు పికేస్తాను అని ప్రచారం చేశారు.. కానీ దానికి భిన్నంగా ఈరోజు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసి ప్రజల పట్ల మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. విజనరికి ప్రిజనరికి చాల తేడా ఉంటుంది. చంద్రబాబు విజనరితో హైద్రాబాద్ ను అభివృద్ది చేశారు. పేదరికం నుంచి పేదలను ధనవంతులుగా చేయడమే P4 యొక్క లక్ష్యం. దుష్పచారాలు చేసి ప్రాజెక్టులను అడ్డుకుంటే రెడ్ బుక్ లో పేర్లు ఎక్కుతాయ్. కార్యకర్తలను కలిసే సమయం జగన్ కు లేదు.. జగన్ ఇంటి ముందు రోడ్డు కోసం పేదల నివాసాలు రాత్రికి రాత్రి ఖాళీ చేయించారు.రెడ్ బుక్ లో చట్టాన్ని ఉల్లంఘించిన వారి పేర్లు ఉంటాయ్.. వారికి తగిన విధంగా శిక్ష ఉంటుంది. రెడ్ బుక్ చూసి ఒకరికి గుండె పోటు, మరొకరికి చెయ్యి విరిగిందని అన్నారు.