
అమరావతి :
ఏపీ రాజధాని అమరావతిలో మరో కీలక నిర్మాణానికి ముందడుగు పడింది. ప్రవాసాంధ్రుల కోసం ఏపీఎన్ఆర్టీ సొసైటీ సంస్థ 'ఎన్ఆర్ ఐకాన్' పేరుతో మూడు దశల్లో (5 ఎకరాల విస్తీర్ణం) 36 అంతస్తుల భారీ భవనానికి సంబంధించి ఫౌండేషన్ నిర్మాణానికి టెండర్లు పిలిచింది. దాదాపు రూ.600 కోట్ల అంచనా వ్యయంతో జంట టవర్లుగా దీన్ని నిర్మించనున్నారు. ఇందులో నివాస ఫ్లాట్లను, కార్యాలయ ప్రాంతాన్నీ వారికే విక్రయిస్తారు.