YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆ ముగ్గురి మౌనం...దేనికి సమాధానం

ఆ ముగ్గురి మౌనం...దేనికి సమాధానం

శ్రీకాకుళం, ఏప్రిల్ 11, 
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైసీపీలో ఆ ముగ్గురు అన్నీ తామే అన్నట్లు వ్యవహరించారు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆ ముగ్గురు సీనియర్లు పార్టీ అధికారంలో ఉన్నంత కాలం గట్టిగానే చక్రం తిప్పారు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆ దిగ్గజాలు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇంటి గడప దాటకపోతుండటం చర్చనీయాంశంగా మారింది. సడన్‌గా ధర్మాన సోదరులు, తమ్మినేని సీతారాంకి అంత రాజకీయ వైరాగ్యం ఎందుకొచ్చింది?. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి. పార్టీలు గెలుస్తాయి, ఓడిపోతాయి. ఒకప్పుడు పరాజయం పాలైన పార్టీల నేతలు పవర్‌లోకి రావడానికి పట్టుదలతో పావులు కదిపేవారు. కానీ ప్రస్తుతం రాజకీయాలు బాగా మారిపోయాయి. రాజకీయనాయకులు అధికారంలో ఉంటే ఒకలాగా.. లేకపోతే మరోలాగా వ్యవహారిస్తున్నారు . అధికారంలో ఉన్నప్పుడు అన్నిభోగాలు అనుభవించిన నాయకులు అధికారం లేకపోయేసరికి ప్రజలకు, పార్టీ శ్రేణులకు ముఖం చాటేసి తిరుగుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేతల పరిస్థితి అదే విధంగా తయారైంది.2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలలో తొమ్మిది నియోజకవర్గాలను వైసీపీ కైవసం చేసుకుంది. అధికారం చెలాయించిన వైసీపీలో ఎక్కడ చూసినా అన్నీ తామే అనేలా వ్యవహరించిన సిక్కోలు జిల్లా బడా నేతలు .. మొన్నటి ఎన్నికలో ఓడిపోయేసరికి ఒక్కసారిగా.. పిన్‌డ్రాప్ సైలెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ముఖ్యమంత్రి హోదాలో జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు నియోజకవర్గంతో తేడా లేకుండా ఆ బడా నేతలే అయనకి కుడి పక్క.. ఎడమ పక్క దర్శనమిచ్చేవారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభంజనంలో వైసీపీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో తుడిచి పెట్టుకుపోయింది.అప్పటి దాకా రాజసం వెలగబెట్టిన మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, సిదిరి అప్పలరాజులతో పాటు అప్పట్లో స్పీకర్‌గా పనిచేసిన తమ్మినేని సీతారాంలు ఒక్కాసారిగా సైలెంట్ అయిపోయారు. అసలు రాజకీయాల్లో ఉన్నారా? లేదా ? అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దాంతో బలం అనుకున్నవారే బలహీనులుగా మారారoటూ సొంత పార్టీ వారే పెదవి విరుస్తున్నారు. ఆశలు పెట్టుకున్న నేతలే పార్టీకి భారంగా మారుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ కోసం వారు పనిచేయరు ..ఇంకెవరినీ పనిచేయనీయడం లేదని తెగ ఫీల్ అయిపోతున్నారు.నాడు వైసిపి అధికారంలో ఉండగా పదవులు అనుభవించిన నేతలే , నేడు పార్టీ కష్టకాలంలో దూరంగా ఉండటం తీవ్ర విమర్శల పాలవుతోంది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో ఉద్దండులుగా పేరున్న ధర్మాన సోదరులు , తమ్మినేని సీతారాం.. ఈ ముగ్గురు వైసిపికి బలం. సామాజికంగా , ఆర్థికంగా బలమైన పునాదులు ఉన్న నేతలు. ఎన్నో దశాబ్దాలుగా రాజకీయాలు నెరుపుతూ వస్తున్నారు. ఎన్నో ఆటుపోట్లు చవి చూసారు. ఐతే 2024 సార్వత్రిక ఎన్నికల తరువాత మాత్రం ఈ ముగ్గురు నేతలు వైసీపీని పట్టించుకోవడమే మానేశారంట.మరీ ముఖ్యంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాధరావు అసలు రాజకీయాలకే దూరంగా ఉంటున్నారు. కనీసం పార్టీ లీడర్స్‌కు కూడా అందుబాటులో ఉండటం లేదంట . ధర్మాన ప్రసాధరావు తిరిగి పోలిటికల్ గా యాక్టివ్ అవుతారో లేదో కూడా తెలియదు అంటున్నారు ఆయన అనుచరులు . తన మనసులో ఏం ఉందో బయటకు చెప్పడం లేదంట ధర్మాన ప్రసాదరావు. గత ప్రభుత్వంలో కీలక రెవెన్యూ శాఖ ను నిర్వహించారు. ఎన్నికల సమయంలో నిర్వేదంతో మాటాడిన ధర్మాన , రాజకీయాలలో కొనసాగాలని లేదని వైరాగ్యం ప్రదర్శించారు. దానికి తగ్గట్లే కూటమి ప్రభుత్వం వచ్చాక పల్లెత్తు మాటాడటం లేదు.మరో వైపు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం పోలిటికల్ మీటింగ్స్ కు , కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కోద్ది రోజుల క్రింతం మీడియా ముందుకు వచ్చిన తమ్మినేని కుటుంబంలో ఆరోగ్యపరమైన ఇష్యూల కారణంగా దూరంగా ఉంటున్నానని తెలిపారు. దీంతో కొంత క్లారిటీ ఇచ్చినట్లు అయినా , ఆయన ప్రాతినిధ్యం వహించిన ఆమదాలవలస నియెజకవర్గం వైసపీ ఇంచార్జ్ పదవి చింతాడ రవికుమార్ కు కట్టబెట్టడంతో తమ్మినేని అధిష్టానం పెద్దలపై కినుక వహించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.మరో కీలకనేత వైసిపి ఆవిర్భావం నుంచీ పార్టీలో ఉంటూ అధినేత జగన్ కు నమ్మిన బంటుగా పేరుపడ్డ ధర్మాన కృష్ణదాస్ . వైసీపీ అధికారంలో ఉండగా డిప్యూటి సిఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన్ని జగన్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించారు. అయితే వైసిపి అధినాయకత్వం పిలుపునిచ్చే కార్యక్రమాలను ఏదో చేసాం అంటే చేసాం అన్నట్లు ధర్మాన కృష్ణదాస తూతూ మంత్రంగా కానిచ్చేస్తున్నారంట. జిల్లా కేంద్రంలో పార్టీకి కనీసం నిలువ నీడలేదంట. గతంలో రెండు మూడు చోట్ల ఆఫీసులు నిర్వహించిన వైసిపికి ఇప్పుడు శ్రీకాకుళంలో కార్యాలయమే లేకుండా పోయింది.కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక వైసీపీ మార్క్ కార్యక్రమం ఒక్కటంటే ఒక్కటి కూడ నిర్వహించలేదంట జిల్లాలో . వైసిసి కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా పట్టించుకునే నాధుడు లేడంటూ ఆవేదన చెందుతున్నారు ద్వితీయ శ్రేణి నేతలు. ధర్మాన కృష్ణదాస్ పార్టీకి లాయల్ అంటూ మాటాడటం మినహా , పార్టీ బలోపేతానికి చేసింది శూన్యం అంటున్నారు సొంతపార్టీ నేతలు. ఇలా ఈ ముగ్గురు కీలక నేతలు గడప దాటకపోవడంతో క్యాడర్ నిరుత్సాహానికి గురౌతున్నారటఅధికారంలో ఉన్నప్పుడు అంతా తామే అన్నట్లు వ్యవహరించిన ఈ సీనియర్ నేతలు , నేడు పార్టీ ఇబ్బందులలో ఉండగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లడం ఏంటని కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వయోభారం, ఆరోగ్య సమస్యలతో రాజకీయాలు వద్దనుకుంటే రిటైర్‌మెంట్ ప్రకటించాలని.. అప్పుడు పార్టీకి కొత్త నాయకత్వం దొరుకుతుందని క్యాడర్ అభిప్రాయపడుతోంది. అంతే కాని ఏదీ చెప్పకుండా, సైలెంట్‌గా ఉండిపోతే తమ పరిస్థితి ఏంటని కార్యకర్తలు మండిపడుతున్నారు.

Related Posts