YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

వేలానికి గోల్కండ రాయల్‌ డైమండ్‌..

వేలానికి గోల్కండ రాయల్‌ డైమండ్‌..

హైదరాబాద్, ఏప్రిల్ 15, 
ఇప్పుడు అదే వజ్రం జెనీవాలోని ఫోర్ సీజన్స్ హోటల్ డెస్ బెర్గ్స్‌లో వేలానికి ఉండనుంది. అప్పట్లో ఇండోర్ మహారాజు వద్ద ఈ ఉంగరం ఉండేదని క్రిస్టీస్ ఇంటర్నేషనల్ జ్యుయెలరీ చీఫ్ రాహుల్ కడాకియా అన్నారు. ఇటువంటి ఉంగరం ఎన్నడూ వేలానికి రాలేదని తెలిపారు. వేలంలో ఇది రూ.300 కోట్లు – రూ.430 కోట్ల మధ్య అమ్ముడుపోవచ్చని చెప్పారు.ఇలాంటి చాలా అరుదైన, విలువైన వజ్రాలు జీవితకాలంలో ఒకసారి మాత్రమే వేలానికి వస్తాయని రాహుల్ కడాకియా అన్నారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ అయిన తమ క్రిస్టీస్ 259 సంవత్సరాలుగా పనిచేస్తోందని తెలిపారు. ఇన్నేళ్లుగా క్రిస్టీస్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ, ముఖ్యమైన వజ్రాలను విక్రయించిందని అన్నారు.తమ వేలంలో గతంలో అమ్ముడైన ప్రసిద్ధ గోల్కొండ వజ్రాలకు ఉదాహరణలుగా పలు డైమండ్ల పేర్లను ఆయన వివరించారు. ఆర్చ్‌డ్యూక్ జోసెఫ్ డైమండ్, ప్రిన్సీ డైమండ్, విట్టెల్స్‌బాచ్ డైమండ్ వంటివాటిని అమ్మామని చెప్పారు. రాజ వారసత్వం, అసాధారణ రంగు, పరిమాణంతో ‘ది గోల్కొండ బ్లూ’ డైమండ్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన నీలి రంగు వజ్రాలలో ఒకటని రాహుల్ కడాకియా ఒక ప్రకటనలో తెలిపారు.క్రిస్టీస్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ‘ది గోల్కొండ బ్లూ’ డైమండ్ ఒకప్పుడు ఇండోర్ మహారాజా యశ్వంత్ రావు హోల్కర్ IIకు చెందింది. 1923లో మహారాజ తండ్రి ఈ వజ్రంతో కూడిన ఒక బ్రాస్లెట్‌ను తయారు చేయాలని ఫ్రాన్స్‌కు చెందిన ప్రసిద్ధ లగ్జరీ ఆభరణాల బ్రాండ్ చౌమెట్‌కి ఆర్డర్‌ ఇచ్చారు. అంతకు ముందు అదే ఆభరణాల సంస్థ నుంచి “ఇండోర్ పియర్స్” అనే రెండు గోల్కొండ వజ్రాలను ఆయన కొనుగోలు చేశారు.దశాబ్ద కాలం తర్వాత మహారాజు ప్రసిద్ధ ఫ్రెంచ్ లగ్జరీ ఆభరణాల కంపెనీ మౌబౌసిన్‌కు మరో ఆర్డర్‌ ఇచ్చారు. ఈ కంపెనీ ‘ది గోల్కొండ బ్లూ’ డైమండ్‌ను రీడిజైన్ చేసి ఇండోర్ పియర్ వజ్రాలతో పాటు హారంలో చేర్చింది.న్యూయార్క్‌కు చెందిన హ్యారీ విన్‌స్టన్ అనే ప్రసిద్ధ ఆభరణాల వ్యాపారి 1947లో ‘ది గోల్కొండ బ్లూ’ డైమండ్‌ను కొన్నారు. ఆయన ఈ నీలి వజ్రాన్ని అదే పరిమాణంలో ఉన్న మరొక తెల్ల వజ్రాన్ని వాడుతూ బ్రూచ్‌ను తయారు చేశారు. తరువాత ఆ బ్రూచ్ బరోడా మహారాజుకు చేరింది. కొంతకాలం తర్వాత ఆ బ్రూచ్ ఆ రాజకుటుంబం ఒక ప్రైవేట్ వ్యక్తికి అమ్మింది. ఇప్పుడు అదే వజ్రం జెనీవాలోని ఫోర్ సీజన్స్ హోటల్ డెస్ బెర్గ్స్‌లో వేలానికి ఉండనుంది.

Related Posts