YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అవంతికి లైన్ క్లియర్ అయినట్టేనా

అవంతికి లైన్ క్లియర్ అయినట్టేనా

విశాఖపట్టణం, ఏప్రిల్ 23, 
కూతురు కూటమిలో చేరితే మాజీ మంత్రి అవంతికి రూట్ క్లియర్ అయినట్లేనా? అవంతి కూటమిలో చేరేందుకు ద్వారాలు తెరిచినట్లేనా? ఇన్నాళ్లూ అవంతి దారెటని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వార్తలకు కూతురి ఓటుతో సమాధానం దొరికినట్లేనా? వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి అవంతి చూపంతా ఇప్పుడు కూటమివైపేనా? అంటే అవుననే సమాధానం రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది. స్టీల్ సిటీ విశాఖ నగరంలో పొలిటికల్ రూపు రేఖలు మారబోతున్నాయంట. 3రోజుల క్రితం జరిగిన జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మానం ఓటింగ్ తో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకోవడంతో జిల్లా పాలిటిక్స్ లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. కూటమి ఖాతాలోకి విశాఖ మేయర్ పీఠం వచ్చి చరడంతో ఇన్నాళ్లూ ఒక లెక్క…ఇప్పుడొలెక్క మాదిరిగా మారిపోయాయి విశాఖ పాలిటిక్స్. అంతేకాదు…రాబోయే రోజుల్లో జిల్లా రాజకీయ ముఖచిత్రమే పూర్తిగా మారబోతుందన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చక్కర్లు కొడుతోందటవిశాఖ మేయర్ పదవి కూటమికి దక్కడంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె,.6వ జీవీఎంసీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక కీలకపాత్ర పోషించారు. ఆమె వేసిన ఓటుతోనే మేయర్ పీఠం కూటమి ఖాతాలోకి చేరిపోయింది. అప్పటివరకు వైసీపీలో ఉన్న ఆమె..పార్టీకి అండగా నిలబడాలని విప్ కూడా జారీ చేశారు. కానీ సీన్ కట్ చేస్తే…తీరా ఓటింగ్ వచ్చే సమయానికి ఒక్కసారిగా కూటమికి మద్దతుగా నిలిచారు.మ్యాజిక్ ఫిగర్ 74 చేరుకోవడానికి అవంతి కుమార్తె వేసిన ఓటు కూటమికి ఆక్సీజన్ మాదిరిగా మారిందని టాక్ విన్పిస్తోంది. అప్పటివరకు వైసీపీకి అండగా నిలబడాలని విప్ సైతం జారీ చేసిన లక్ష్మి ప్రియాంక.. కూటమికి సపోర్ట్ చేయడంతో అంతా అవాక్కయ్యారట. ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆమె..ఇంకా కూటమిలో మాత్రం చేరలేదు.ఇక రేపో మాపో కూటమిలో లక్ష్మీ ప్రియాంక చేరడం ఖాయమనే టాక్ జిల్లా రాజకీయాల్లో కోడై కూస్తోంది. ఒకవేళ కుమార్తె టీడీపీలో చేరితే.. ఆమె తండ్రి అవంతి శ్రీనివాస్ కూడా కుమార్తె బాటలోనే పయనించి కూటమిలో చేరతారంటూ ఓ వార్త జిల్లా రాజకీయాల్లో చక్కర్లు కొడుతోందట. కూతురి బాటలోనే తండ్రి పయనం అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది.మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్..గత డిసెంబరులో వైసీపీకి రాజీనామా చేశారు. ఇపుడు ఆయన కూటమి వైపే అడుగులు వేస్తున్నారని అంతా ప్రచారం సాగుతోంది. కుమార్తె కూటమిలోకి అడుగు పెట్టడం ఖాయమని..తండ్రి అవంతి కూడా కుమార్తె బాటలోనే కూటమిలోకి ఎంట్రీ ఉంటుందంటూ విశాఖలో టాక్ నడుస్తోంది. అవంతి శ్రీనివాసరావు తన 15 ఏళ్ళ రాజకీయ జీవితంలో నాలుగు పార్టీలు మారారని అంతా అంటున్నారు.ఆయన ఏ పార్టీకి గాలి ఉంటే ఆ వైపుగా మారే పొద్దు తిరుగుడు పువ్వు లాంటి వారని అంతా అనుకుంటున్నారు. ఆయనను రాజకీయంగా ప్రవేశం కల్పించి ఎమ్మెల్యేని చేసింది ప్రజారాజ్యం పార్టీ అని అంతా గుర్తు చేస్తున్నారంట. ఆ తర్వాత 2014లో ఆయన టీడీపీలో చేరి అనకాపల్లి ఎంపీగా గెలిచారు. తిరిగి అయిదేళ్ళు గడవకుండానే టీడీపీని వీడి 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి మూడేళ్ళ పాటు మంత్రిగా కూడా పనిచేశారు. అంతేకాదు వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగానూ వ్యవహరించారు.కూటమి వైపు అడుగులు వేయాలని చూస్తున్న అవంతిపై జిల్లా రాజీకీయాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన రాజకీయంగా ఒక పార్టీలో నిలకడగా ఉండరని..పదే పదే పార్టీలు మారడం ఆయనకు అలవాటే అని సందేహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన రాజకీయ జీవితంలో ఎపుడూ విపక్ష ఎమ్మెల్యేగా లేరని గుర్తు చేస్తున్నారట.వైసీపీ హయాంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నపుడు చంద్రబాబు- లోకేష్ పవన్ ల మీద చేసిన కామెంట్స్ ని ఆయా పార్టీల నాయకులు మళ్ళీ గుర్తుచేస్తున్నారంట. అలాంటి వారిని పార్టీలో చేర్చుకోవద్దని పార్టీ పెద్దలను కోరుతున్నారుట. మరి అవంతి శ్రీనివాస్ చివరకు ఏ పార్టీలో చేరతారనేది రాబోయే రోజుల్లో ఓ క్లారిటీ రానుందని తెలుస్తోంది. కుమార్తె చేరిన తర్వాత చేరతారా లేదా ఇద్దరూ ఒకేసారి పార్టీలో చేరతారా అన్నది చూడాల్సి ఉంది. అసలు తండ్రీకూతురు కూటమిలో చేరతారా లేదా అన్నది కూడా సస్పెన్స్ అంటూ కూడా ఓ చర్చ జరుగుతోంది.

Related Posts