
విజయవాడ, ఏప్రిల్ 26,
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టయి దాదాపు డెబ్భయి రోజులు అవుతుంది. అయినా ఆయన ఇంకా జైలులోనే మగ్గుతున్నారు. కేసుల మీద కేసులు ఆయనపై వరస పెట్టి పెడుతున్నారు. అందుకోసమే బెజవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వల్లభనేని వంశీని టీడీపీ కార్యాలయంలో ఉన్న సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో వల్లభనేని వంశీని ఈ ఏడాది ఫిబ్రవరి 13న అరెస్ట్ చేశారు. అంటే నేటికి వల్లభనేని వంశీ అరెస్టయి దాదాపు డెబ్భయి రోజులవుతుంది. కొన్ని కేసుల్లో బెయిల్ వస్తున్నా మరికొన్ని కేసుల్లో మాత్రం బెయిల్ లభించడం లేదు. అందుకే ఆయన విజయవాడ జిల్లా జైలులోనే మగ్గిపోతున్నారు.. గన్నవరం పోలీస్ స్టేషన్ లో నమోదైన రెండు కేసుల్లో పీటీ వారెంట్లు జారీ అయ్యాయి. వారెంట్లపై నేడు విచారణ చేపట్టనున్న న్యాయస్థానం నిర్ణయాన్ని వెలువరించనుంది. కేవలం సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులతో పాటు గన్నవరం నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్స్ అక్రమ తవ్వకాలపై కూడా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులోనూ వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారు. వీటికి తోడు భూ కబ్జాల ఆరోపణలపై కూడా వంశీపై అనేక కేసులు నమోదు కావడంతో ఒక దాంట్లో బెయిల్ వస్తే మరొక కేసు మెడకు చుట్టుకుంటుంది. ఫిబ్రవరి 13న... వైసీపీ అధికారంలో ఉండగా వల్లభనేని వంశీ వ్యవహరించిన తీరుపై ఆగ్రహంగా ఉన్న కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తుందని ముందే తెలిసినప్పటికీ ఇలా వరస కేసులు వచ్చిపడతాయని ఊహించలేదు. సోషల్ మీడియాలో టీడీపీ క్యాడర్ ప్రభుత్వాన్ని నిలదీస్తుండటంతో ఇక ఫిబ్రవరి 13న పకడ్బందీగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గన్నవరం నియోజకవర్గాన్ని వదిలేసి హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అక్కడే మకాం వేశారు. అయితే పోలీసులు మాత్రం అన్నికోణాల్లో ఆలోచించి వరస కేసులు నమోదవుతుండటంతో ఇప్పట్లో వల్లభనేని వంశీ బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. తాను వేసిన సింగిల్ బ్యారక్ కాదని, అందరిలోనూ కలిపి ఉంచాలని, బయట నుంచి ఆహారాన్ని తెప్పించుకునేందుకు అవకాశం ఇవ్వాలని వల్లభనేని వంశీ గతంలో న్యాయస్థానాన్నిఆశ్రయించారు. అదే సమయంలో మిగిలిన ఖైదీలతో పాటు తనను ఉంచాలని కూడా కోరారు. తనకు ప్రాణభయం ఉందని కూడా వల్లభనేని వంశీ చెప్పారు. అయితే వరసగా కేసులు నమోదవుతుండటం, ఒక కేసులో బెయిల్ వచ్చినా మరొక కేసులో అరెస్ట్ చేయడానికి పోలీసులు అన్నీ సిద్ధం చేస్తన్నారు. అందుకే వల్లభనేని వంశీ ఇప్పట్లో బయటకు వచ్చేందుకు ఛాన్స్ లేదు. ఇంకా బెజవాడలోని మండుటెండలకు మరికొద్ది కాలం జైలులోనే ఉండి పోవాల్సి పరిస్థితులు ఉన్నాయంటున్నారు.
కేడర్ లోనూ నిరుత్సాహం
గత ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైన వైసీపీని చాలా మంది వదిలేశారు. కీలక రెడ్డి నాయకుల నుంచి అనేక మంది బీసీల వరకు.. కూడా పార్టీకి దూరమయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు కీలకమైన కార్యకర్తల వంతు వచ్చింది. ఏ పార్టీకైనా.. నాయకులతోపాటు.. కార్యకర్తలు చాలా కీలకం. నాయకులు జంప్ చేస్తారు..కానీ.. కార్యకర్తలు మాత్రం ఎంతో కొంత అంకిత భావంతో పార్టీలను అంటిపెట్టుకుని ఉంటారు. ఎన్నికల సమయంలోనూ..వారే కీలకం.ఈ విషయాన్ని గుర్తించే.. దాదాపు అన్ని పార్టీలూ..కార్యకర్తలే తమకు బలమని.. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతాయి. కార్యకర్తల సెంట్రిక్‌గా అనేక కార్యక్రమాలు కూడా చేపడతాయి. అయితే.. వైసీపీ విషయానికి వస్తే.. కార్యకర్తలనను పక్కన పెట్టిన విషయం తెలిసిందే. గత వైసీపీ హయాంలో వలంటీర్లే సర్వస్వంగా అప్పట్లో సీఎం జగన్ వ్యవహరించారు. ఇది పార్టీకి మేలు చేయకపోగా.. ఓడించేసింది. తద్వారా.. పార్టీ నామరూపాలు లేకుండా పోయిందన్న చర్చ ఉంది.ఇంత పరాభవం తర్వాత.. ఒకటి రెండు సార్లు.. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తున్నానని జగన్ చెప్పుకొచ్చా రు. కానీ.. నెలలు గడిచిపోతున్నా.. ఆయన కార్యకర్తల విషయంలో ఎలాంటి నిర్ణయాలూ తీసుకోవడం లేదు. గుర్తింపు అంతకన్నా లేదు. పైగా.. టీడీపీ సహా కూటమి నాయకులు.. కార్యకర్తలపై పోరాటాలు చేయాలని పిలుపునిస్తున్నారు. ఇదే జరిగితే.. జైలుకు వెళ్తోంది.. కార్యకర్తలు, నాయకులే. కనీసం వారిని పరామర్శించడంలోనూ.. న్యాయపరంగా రక్షణ కల్పించడంలోనూ..వైసీపీ అధినేత విఫలమవుతున్నారు.ఆయా విషయాలను గమనిస్తున్న వైసీపీ కార్యకర్తలు.. ఇప్పుడు ప్లేట్ మార్చేస్తున్నారు. టీడీపీ కానీ.. జనసేన కానీ..కార్యకర్తలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని వారు గుర్తించారు. సీఎం చంద్రబాబు సైతం..తన ప్రొటోకాల్ ను పక్కన పెట్టి మరీ.. కార్యకర్తలు, నాయకుల ఇళ్లకు వెళ్లి కష్టాల్లో ఉంటున్నవారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. భరోసా కల్పిస్తున్నారు. ఈ పరిణామాలతో వవైసీపీలో అలజడి రరేగింది. ఇంకా పార్టీని నమ్ముకుని ఇక్కడే ఉంటే కష్టమనిభావిస్తున్న వారు.. జెండా మార్చేసేందుకు రెడీ అయ్యారు. గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక మంది కార్యకర్తలు.. గత రెండు రోజుల్లోనే టీడీపీ, జనసేనల బాటపట్టడం గమనార్హం