
నెల్లూరు, ఏప్రిల్ 25,
ప్రజా నాయకుడు.. లేదా నాయకురాలు.. కావడానికి జెండా పట్టుకునే తిరగాల్సిన అవసరం లేదని.. ఈ దేశంలో అనేక మంది నిరూపించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తూ.. ప్రజల మనసుల్లో చోటు దక్కించుకున్నవారు ఎందరో ఉన్నారు. అంత మాత్రాన వారు రాజకీయా ల్లో పాల్గొని పోటీ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి వారిలో నర్మదాబచావో(నర్మదా నదిని రక్షించండి) పేరుతో ఉద్యమించిన మేధా పాట్కర్ వంటివారు ఉన్నారు.ఇప్పుడు అలానే అప్రకటిత ప్రజానేతగా.. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర నిలుస్తున్నారు. ఆమె.. ప్రజలకు చేరువ కావడం.. వారి సమస్యలు పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. నారా వారి సొంత నియోజకవర్గం కుప్పంలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. నెలకు మూడు నుంచి నాలుగురోజుల పాటు అక్కడే ఉంటున్నారు. ఇక్కడ మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నారు. సాయం చేస్తున్నారు. అభివృద్ది పనులు కూడా చేపడుతున్నారు.అంతేకాదు.. ఒక్కకుప్పమే అయితే.. భువనేశ్వరి గురించి.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎన్టీఆర్ జిల్లా నుంచి ఖమ్మం వరకు కూడా.. ఆమె తన ప్రజా ప్రస్థానాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కృష్ణాజి ల్లాలోని తన తండ్రి గ్రామం నిమ్మకూరులో పెద్ద ఎత్తున పాఠశాలను నిర్మిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులను ఎంపిక చేసి.. వారికి స్కాలర్ షిప్పులు అందిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్టును మరింత బలోపే తం చేసి.. పేదలకు, సమాజంలో అణగారిన వర్గాలకు ఆసరా చూపిస్తున్నారు.ఇదంతా స్వచ్ఛంద సేవే కదా.. ప్రజానేత ఎలా అవుతారన్న ప్రశ్నలు సహజం. అయితే.. కేవలం స్వచ్ఛం ద సేవకు మాత్రమే భువనేశ్వరి పరిమితం కాలేదు. అవసరానికి తగిన విధంగా రాజకీయ అవతారం కూడా ఎత్తుతున్నారు. గత ఎన్నికల్లో ఊరూ వాడా ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా.. పీ4 పథకంపై ఆమె అంతర్గతంగా పారిశ్రామిక వేత్తలతో చర్చిస్తున్నారు. వీరిలో మహిళా పారిశ్రామికవేత్తలను ఒప్పించే పనిలో ఉన్నారు. తద్వారా.. చంద్రబాబు ఆశయాలకు దన్నుగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. సో.. భువనేశ్వరి రాజకీయ నేత కాకపోవచ్చు.. కానీ, అప్రకటిత ప్రజానేతగా మాత్రం గుర్తింపు పొందుతున్నారనడంలో సందేహం లేదు. ఇటీవల కుప్పం డిగ్రీ కాలేజీలో భువనేశ్వరి ముఖాముఖిలో పాల్గొన్నారు. డ్రగ్స్, గంజాయి యువతను నాశనం చేస్తోందన్నారు. ‘‘వారి స్వలాభం కోసం చాలా మంది మిమ్మల్ని టెంప్ట్ చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. రోల్ మోడల్ పెట్టుకోవాలి’’ అని విద్యార్థులకు సూచించారు. ప్రతి పురుషుని సక్సెస్ మహిళతోనే ముడి పడి ఉంటుందన్నారు. ‘‘కాలేజ్ డేస్ గుర్తుకు వస్తున్నాయి. ఆషామాషీగా వెళ్లి మీరందరూ చేసేదే నేను కూడా కాలేజ్‌లో చేసేదాన్ని. మిమ్మల్ని చూసి గర్వంగా ఉంది. ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అవర్ ఆంధ్రప్రదేశ్ లీడర్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మీ హక్కుకోసం నడవాలి. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీకోసం సంపాదిస్తున్నారు. అది ఈజీ కాదు. హార్డ్ వర్క్. ఏదీ ఫ్రీగా రాదు. కష్టంతోనే వస్తుంది. బాలికలకు పట్టుదల, ధైర్యం, మీమీద నమ్మకం ఉండాలి. పెళ్లి అయ్యేదాకా ఒకటి, తర్వాత మరొకటి. రాజకీయాల్లో బిజినెస్‌లో నన్ను నేను లాక్కుని ముందుకు వెళ్ళాను. మన ధైర్యం మనకుండాలి’’ అని వెల్లడించారు.ముందు నందమూరి కుమార్తెను.. బాబు భార్య సెకండ్. ఒక మహిళగా నేనేమిటి అనేది నాకు తెలుసు. మనందరిలోనూ ఆ శక్తి ఉంది. ఫోకస్ పనిలోపెడితే ముందుకు వెళ్ళచ్చు. హౌస్ వైఫ్ ఉన్నప్పుడు హెరిటేజ్ చూసుకోమన్నారు. నాకే ఏమీ తెలియదు. ఎండీగా బాధ్యతలు ఇచ్చారు. అందరినీ ఒకటే అనుకున్నాను. జీవితాలు బాగుంటాయి. హార్డ్ వర్క్ మీద నమ్మకం పెట్టాలి. నాన్నకంటే గొప్పవాడివి కావాలి. చేయకపోతే నీ ఫ్యూచర్ ఆగుతుంది అని నా కుమారునికి చెప్పా. మీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. ఎవరూ రారు. బద్ధకం ఉంటే జీవితంలో ఎడగలేరు. మీరే ఫ్యూచర్ లీడర్స్, ఏ రంగంలోనైనా. డిసిప్లిన్ ముఖ్యం. నాకు డిసిప్లిన్ ఎక్కువ. స్ట్రిక్ట్ నెస్ లేకపోతే నేను ముందుకు వెళ్లలేను. ఉద్యోగాలకు, ఆర్గనైజేషన్ టీమ్ వర్క్ ఉండాలి. అందరూ మనమే అంటేనే భవిష్యత్తు. సంతోషంగా కార్యక్రమం చేపట్టాలి. జీవితంలో టీచర్స్‌ను మరచిపోవద్దు. రెస్పెక్ట్ ఇవ్వాలి వారికి. అందరిలో ఉంటాయి తప్పులు. ఒక వేలు చూపిస్తే 4 వేళ్ళు మనల్ని చూపిస్తాయి. ఇవన్నీ ఎదుర్కొన్నాను నేను. వ్యాపారం, ఉద్యోగం అన్నింటిలోనూ ఆడపిల్ల దేనిలోనూ తక్కువకాదు. నా జీవితంలో చూస్తున్నాను. సోషల్ మీడియా, యూట్యూబ్ మిమ్మల్ని మీ కుటుంబం నుంచి దూరం చేస్తుంది. కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఫోన్లు, సోషల్ మీడియా కుటుంబాలకు దూరం అవుతున్నారు’’ అని తెలిపారు.