YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాలినేనికి చిక్కని పట్టు

బాలినేనికి చిక్కని పట్టు

ఒంగోలు, ఏప్రిల్ 25, 
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. అయితే తనకు పట్టున్న ఒంగోలు కార్పొరేషన్ కు చెందిన కార్పొరేటర్లను అయితే తనతో పాటు జనసేనలోకి తీసుకు వచ్చారు. అయితే మరికొందరు కీలక నేతలను పార్టీలోకి తీసుకు రావాలన్న ఆయన ఆలోచన మాత్రం కార్యరూపం దాల్చడం లేదని తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో జనసేనలోకి వచ్చేందుకు ఎవరూ పెద్దగా సుముఖత వ్యక్తం చేయడం లేదని సమాచారం. అందుకే బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఎంతగా ప్రయత్నించినా కొందరు నేతలు సున్నితంగా తిరస్కరిస్తుండగా, మరికొందరు నేతలు మాత్రం తాము వైసీపీని వదిలి రాలేమని తెగేసి చెబుతున్నారు. జిల్లాపై పట్టున్న నేతగా... బాలినేని శ్రీనివాసులు రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచే ప్రకాశం జిల్లాను తన చెప్పు చేతల్లో పెట్టుకుని ఉన్నారు. నాడు పీసీసీ చీఫ్ గా, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సమీప బంధువు కావడంతో ఆయన చెప్పిందే మాట.. చేసిందే శాసనం అన్నట్లు ఉండేది. నాటి నుంచి 2019 ఎన్నికల వరకూ బాలినేని శ్రీనివాసులు రెడ్డి చెప్పిన వారికే టిక్కెట్లు దక్కేవి. అందుకే బాలినేని అందరు నేతలతో టచ్ లో ఉంటారు. వారు కూడా బాలినేని ప్రాపకం కోసం పాకులాడేవారు. అలాంటిది 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత బాలినేని వైసీపీకి రాజీనామా చేయడం, తర్వాత జనసేనలో చేరిపోవడం ఒకరకంగా మిగిలిన నేతలకు కూడా షాకింగ్ కు గురి చేశాయి. కానీ బాలినేని శ్రీనివాసులు రెడ్డి పార్టీని వీడితే అనేక మంది నేతలు కూడా ఆయన వెంట పోలోమంటూ క్యూ కడతారని భావించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే ఊహించారు. అందుకే బాలినేనికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. కానీ బాలినేని చేరి నెలలు కావస్తున్నా ఒక్క పేరున్న నేత కూడా ప్రకాశం జిల్లా నుంచి రాకపోవడం జనసేనలోనూ చర్చనీయాంశమైంది. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు, హామీలు అమలు చేయకపోవడం, తిరిగి జగన్ పుంజుకునే అవకాశాలుంటాయన్న అంచనాలు వినపడుతుండటంతో నేతలు పార్టీని వీడి వచ్చేందుకు సుముఖంగా లేరని చెబుతున్నారు. బాలినేని వదలకుండా ప్రయత్నిస్తున్నా కార్పొరేటర్లు మినహా మరో ముఖ్యనేత ప్రకాశం జిల్లాలో ఆయన వెంట రాకపోవడానికి ఇదే కారణమని అంటున్నారు. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి.. నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా బాలినేని పని చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు.దీంతో బాలినేని సైతం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. వైఎస్ జగన్ అడుగులో అడుగు వేసి నడిచారు. ఆయన ఒంగోలు ఎమ్మెల్యేగా ఆరుసార్లు గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్‌లో స్థానం సంపాదించారు. రెండున్నరేళ్ల తర్వాత జగన్ కేబినెట్‌ను పునర్ వ్యవస్థకీరించారు. దీంతో మంత్రి పదవిని బాలినేని కోల్పోయారు.అయితే వైఎస్ జగన్ కుటుంబంతో బాలినేనికి సమీప బంధుత్వం ఉంది. అయినా ఆయన్ని కేబినెట్‌ నుంచి తొలగించడంతో తీవ్ర మనో వేదనకు గురయ్యారనే గట్టి ప్రచారం అయితే జిల్లా గట్టిగానే సాగింది. అందువల్లే నాటి నుంచి పార్టీ అధిష్టానానికి ఆయన సాధ్యమైనంత దూరంగా ఉన్నారనే చర్చ సైతం సాగింది. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారానికి దూరమైంది. ఎమ్మెల్యేగా సైతం బాలినేని ఓటమి పాలయ్యారుపార్టీ వీడేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇదే విషయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్‌ వద్ద కుండ బద్దలు కొట్టారు. బాలినేనికి నచ్చ జెప్పేందుకు పార్టీ అధినేతే కాదు.. అగ్రనేతలు సైతం ప్రయత్నించారు. కానీ బాలినేని మాత్రం వారి సూచనలు సలహాలు పట్టించుకోలేదు

Related Posts