YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుపతి స్టేషన్ రూ.850 కోట్లతో అభివృద్ధి పనులు

తిరుపతి స్టేషన్ రూ.850 కోట్లతో అభివృద్ధి పనులు

తిరుపతి, ఏప్రిల్ 25, 
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే స్టేషన్‌లు కొత్త అందాలను అద్దుకుంటున్నాయి.. అమరావతికి కీలకంగా ఉన్న రైల్వే స్టేషన్‌లకు మహర్దశ వస్తోంది. అమరావతి సమీపంలోని మంగళగిరి రైల్వే స్టేషన్‌తో పాటుగా విజయవాడ రైల్వే స్టేషన్‌‌‌ కేంద్రం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూపురేఖలు మారబోతున్నాయి.. అత్యాధునిక సదుపాయాలతో స్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ పథకం కింద విజయవాడ రైల్వే స్టేషన్ త్వరలో విమానాశ్రయంలా మారనుంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.850 కోట్లతో అభివృద్ధి పనులు చేయనున్నారు. రైల్వే బోర్డు దీనికి సంబంధించిన డీపీఆర్‌ను ఆమోదించాల్సి ఉంది.. ఆమోదం రాగానే పనులు మొదలవుతాయి. విజయవాడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు.విజయవాడ రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కీలకమైనది.. ఇక్కడ ప్రతిరోజు లక్ష మంది ప్రయాణికులు, అదే పండుగలు, సెలవు రోజుల్లో ఈ సంఖ్య రెండు లక్షల వరకు ఉంటుంది. మొత్తం 10 ప్లాట్‌ఫాంలు ఉన్నాయి.. ప్రతిరోజు 250కి పైగా ప్రయాణికుల రైళ్లు, 80 గూడ్సు రైళ్లు విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. విజయవాడ రైల్వే స్టేషన్‌కు ఐదు ప్రవేశ ద్వారాలతో అరుదైన గుర్తింపు పొందింది. ప్రతి ఏటా ఏకంగా రూ.500 కోట్ల ఆదాయం వస్తుండటంతో గతేడాది బెజవాడ రైల్వే స్టేషన్‌ ఎన్‌ఎస్‌జీ 01 హోదా కూడా పొందిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం స్టేషన్లో ఉన్న ప్రవేశ ద్వారాలు చిన్నగా ఉన్నాయి.. వాటిని వెడల్పు చేయనున్నారు. వాహనాల పార్కింగ్ కోసం ఎక్కువ స్థలం కేటాయిస్తారు. అలాగే షాపింగ్ కాంప్లెక్స్‌లు, భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. స్టేషన్ మొత్తం కొత్తగా కనిపించేలా మార్పులు చేస్తారు. లైటింగ్, ఎస్కలేటర్లు, ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలను విశాలంగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే ప్రయాణికుల కోసం మంచి విశ్రాంతి గదులు, ఏసీ, నాన్ ఏసీ గదులు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. రిజర్వేషన్ కేంద్రాలు, వెయిటింగ్ హాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర షాపులు కూడా ఉంటాయి.విజయవాడ రైల్వే స్టేషన్‌లో సౌకర్యాలు పెంచుతున్నా ప్రయాణికుల రద్దీకి సరిపోవడం లేదు. విశ్రాంతి గదులు, ప్లాట్‌ఫాంలు, లిఫ్టులు, ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు, పార్కింగ్ స్థలం తక్కువగా ఉన్నాయి. ఈ మేరకు అమరావతి రాజధాని కావడం వల్ల రాబోయే ఐదేళ్లలో విజయవాడ స్టేషన్‌కు రద్దీ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని డీపీఆర్‌ తయారు చేసి కేంద్రానికి పంపించారు.డీపీఆర్‌కు వీలైనంత త్వరగా కేంద్రం ఆమోద ముద్ర వేసేలా రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు ప్రయత్నిస్తే అభివృద్ధి పనులు మొదలవుతాయంటున్నారు. అంతేకాదు అమృత్‌ పథకం కింద కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని రాయనపాడు, గుణదల, గుడివాడ, మచిలీపట్నం రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. గుణదల పనులు దాదాపు పూర్తికాగా.. రాయనపాడు పనులు కూడా త్వరలో పూర్తవుతాయని చెబుతున్నారు అధికారులు.

Related Posts