YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గూగుల్ లో ట్రెండింగ్ టాపిక్ గా పహల్గామ్

గూగుల్ లో ట్రెండింగ్ టాపిక్ గా పహల్గామ్

హైదరాబాద్, ఏప్రిల్ 25, 
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిపై భారతదేశంలో మాత్రమే కాదు, పాకిస్తాన్‌లో కూడా వాతావరణం వేడెక్కింది. మంగళవారం అంటే ఏప్రిల్ 22న జరిగిన ఈ దాడిపై ఒకవైపు భారతదేశంలో కోపం, ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరోవైపు పాకిస్తాన్ ఇంటర్నెట్ వినియోగదారులు కూడా ఈ ఘటన గురించి ఆరా తీస్తున్నారు జరుగుతున్న చర్చల్లో పాల్గొంటున్నారు. భారత్ చేపట్ట చర్యల గురించి తెలుసుకుంటున్నారు.  ఈ దాడి తరువాత పాకిస్తాన్‌లోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్)  గూగుల్‌లో  దీనికి రిలేటెడ్‌గా ఉండే  కీవర్డ్స్‌  వేగంగా ట్రెండ్ అవుతున్నాయి. నివేదికల ప్రకారం, పాకిస్తాన్‌లోని ప్రజలు పెద్ద సంఖ్యలో ‘పహల్గాం, పహల్గాం ఎటాక్, కాశ్మీర్, పుల్వామా, జమ్ము ’ వంటి పదాల గురించి వెతుకుతున్నారు.ఈ ఉగ్రవాద ఘటన తరువాత భారతీయ సోషల్ మీడియాలో #PahalgamTerroristAttack,  #Modi వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతుండగా, పాకిస్తాన్‌లో కూడా ఈ దాడిపై ప్రజల ఆసక్తి కనిపిస్తోంది. సోషల్ మీడియాలో పాకిస్తాన్ వినియోగదారులు ఈ దాడిపై వేర్వేరుగా స్పందిస్తున్నారు. ఈ దాడిపై పొరుగు దేశం పాకిస్తాన్ నుంచి ఒక అధికారిక ప్రకటన కూడా వచ్చింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఈ ప్రకటన విడుదల చేశారు. ఈ దాడిలో పాకిస్తాన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఖండించారు. అయితే, సోషల్ మీడియాలో పాకిస్తాన్ వినియోగదారుల ప్రతిస్పందన ద్వారా ఈ ఘటన అక్కడ కూడా కలకలం రేపిందని స్పష్టమవుతోందిఅదే సమయంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదాన్ని భారతదేశం సహించదని ఆయన అన్నారు. అంతేకాదు దానికి తగిన ప్రతిస్పందన ఇస్తుందని అన్నారు. అలాగే ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాడ సంతాపం తెలిపారు. ఢిల్లీలోని ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, 'ఈ దాడి అమానుషమైనది మాత్రమే కాదు,  సిగ్గుచేటు ప్రయత్నం. దీనికి స్పందన కచ్చితంగా బలంగా ఉంటుంది. చేసిన వాళ్లనే కాకుండా దీని వెనుక ఉన్న వారిని కూడా బయటకు లాగుతాం' అని అన్నారు.గూగుల్‌లో ట్రెండ్ అవుతున్న కీవర్డ్‌లు భారతదేశం మాత్రమే కాదు, పాకిస్తాన్ ప్రజలు కూడా పహల్గాం దాడికి సంబంధించిన వివరాలు  తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. సెర్చ్ ట్రెండ్స్ ద్వారా పాకిస్తాన్ పౌరులు భారత్-పాక్ సంబంధాలపై దీని ప్రభావాన్ని గురించి ఆందోళన చెందుతున్నారని వెల్లడైంది.

Related Posts