
మదనపల్లె
రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో అన్నమయ్య జిల్లా మదనపల్లె రెడ్డీస్ కాలనీకి చెందిన వైసిపి నేత, రైస్ మిల్ మాధవ రెడ్డిని గురువారం రాత్రి తిరుపతి సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. సిఐడి డిఎస్పి కొండయ్య నాయుడు కథనం మేరకు.. గత ఏడాది జూలైలో జరిగిన ఫైళ్ళ దగ్ధం కేసులో ఏ టు ముద్దాయిగా ఉన్న మాధవరెడ్డి కండిషన్ బెయిలుపై బయట తిరుగుతూ ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటికే సబ్ కలెక్టర్ కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గౌతం తేజ్ ను సీఐడి అధికారులు మూడు నెలల క్రితం అరెస్టు చేయగా ఈ రోజు మాధవరెడ్డిని సిఐడి అధికారులు అరెస్టు చేసినట్లు తెలిపారు.