YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మార్కెట్లోకి ఫ్లెక్స్ ఇంజిన్ బైక్స్..

మార్కెట్లోకి ఫ్లెక్స్ ఇంజిన్ బైక్స్..

 త్వరలోనే ఇండియా మార్కెట్లోకి ఫ్లెక్స్ ఇంజిన్ బైక్స్ వస్తాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. రెండు బైక్స్ కంపెనీలు ఎలక్ట్రిక్, ఫ్లెక్స్ ఇంజిన్ బైక్‌లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాయని గడ్కరీ ప్రకటించారు. జనవరి నెలాఖరులోగా బైక్స్‌ను మార్కెట్లోకి తెస్తామని రెండు కంపెనీలు చెప్పాయని తెలిపారు. రెండు రకాల ఇంధనాలను ఫ్లెక్స్ ఇంజిన్‌లో వినియోగించొచ్చన్నారు మంత్రి గడ్కరీ. పెట్రోల్, ఇథనాల్‌లతో ఫ్లెక్స్ ఇంజిన్ బైక్స్ నడుస్తాయి. పెట్రోల్ వినియోగాన్ని క్రమంగా తగ్గించాలనే వ్యూహంలో భాగంగా ఇథనాల్‌ను ప్రత్యామ్నాయంగా వినియోగించాలని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్టు గడ్కరీ గుర్తు చేశారు.
క్రూడ్ ఆయిల్ కోసం ప్రతి ఏటా రూ. 7 లక్షల కోట్లను ఖర్చుచేస్తున్నామని, ఇందులో కనీసం రూ. 2 లక్షల కోట్లను ఇథనాల్ వైపు మళ్లించినా వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చినట్లు అవుతుందన్నారు. ఒక టన్ను వరి పొట్టు నుంచి 280 లీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేయొచ్చన్నారు. గోధుమ పొట్టు, వెదురు చెట్ల నుంచి ఇథనాల్‌ను ఉత్పత్తి చేయొచ్చని నితిన్ గడ్కరీ చెప్పారు. ఇథనాల్ ఉత్పత్తి పెరిగేందుకు అందుకు అనుకూలమైన పంటలను వేయాలని చెప్పారు. అమెరికా, బ్రెజిల్, కెనడాల్లో మెర్సిడెజ్, బీఎండబ్ల్యూ, టయోటా కార్లు ఫ్లెక్స్ ఇంజిన్‌తో నడుస్తున్నాయని గడ్కరీ గుర్తు చేశారు.

Related Posts