
విశాఖపట్నం
హోంమంత్రి అనిత సింహాచలంలో గోడకూలిన ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గోడకూలిన ప్రాంతంలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్ పై సిమెంట్ గోడ కూలింది. ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నేతృత్వంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సింహాచలం రూ.300 క్యూలైన్లో జరిగిన గోడ కూలిన దుర్ఘటన వద్ద ఎన్.డి.ఆర్.ఎఫ్., ఎస్.డి.ఆర్.ఎఫ్., ఫైర్, పోలీస్ శాఖ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలను హోంమంత్రి అనిత,జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.