
హైదరాబాద్, ఏప్రిల్ 30,
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదు. ఇంటర్ ఫలితాలు వచ్చి వారం రోజులు గడుస్తున్నా దోస్త్ షెడ్యూల్‌పై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలపై సందిగ్ధత నెలకొంది. సాధారణంగా ఇంటర్ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దోస్త్ షెడ్యూల్ జారీ చేసేవారు. ఈసారి ఫలితాలు వచ్చి వారం రోజులైనా నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందో ఉన్నత విద్యామండలి చెప్పలేకపోతుంది. ఈసారి రెండు విడతల్లోనే దోస్త్ ద్వారా ప్రవేశాలు నిర్వహించి జూన్ 16 నుంచి తొలి సెమిస్టర్ తరగతులను ప్రారంభించాలని ప్లాన్ చేసింది. ఇంకా దోస్త్ ప్రకటన వెలువడక పోవడంతో అకగమిక్ ఇయర్ ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుందిఈసారి దోస్త్‌లో బకెట్ విధానాన్ని తొలగించాలని కొద్దిరోజుల క్రితం ఉన్నతవిద్యామండలి కార్యాలయంలో జరిగిన యూనివర్సిటీ వీసీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. అయితే ఆ నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నత విద్యామండలికి గానీ వీసీలకు గానీ లేదు. దీంతో విద్యాశాఖ కస్సున లేచింది. తమకు సమాచారం ఇవ్వకుండా, తమ ఆమోదం లేకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పది రోజుల క్రితం వీసీలతో సమావేశం నిర్వహించినా.. ఆ సమావేశానికి సంబంధించి తీర్మానాల కాపీ (మినిట్స్) ఇంతవరకు అందలేదు. దాంతో ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీలో జాప్యం నెలకొంది.ఆంధ్రప్రదేశ్ విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు సమగ్రశిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. మొదట ప్రకటించిన షెల్యూల్ ప్రకారం ఏప్రిల్ 28న నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉండగా దానిని మే 2కు వాయిదా వేశామన్నారు. మే19 వరకు స్వీకరన ఉంటుందని వెల్లడించారు.