
విశాఖపట్నం
మే డే స్ఫూర్తితో విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోడాని కి పోరాటాన్ని మరింత ఉధృతం చేద్దామని రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు పిలుపునిచ్చారు.స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట స్టీల్ సిఐటియు కార్యకర్తలు మేడే కవాతు ను నిర్వహించారు. మేడే పతాకాన్ని సిహెచ్ నర్సింగరావు ఆవిష్కరించారు.అనంతరం మేడే సభలో సిహెచ్ నర్సింగరావు మాట్లా డుతూ పెట్టుబడిదారి ఆర్థిక విధా నాలను ద్వారా ప్రపంచ ఆర్థిక సంక్షో భం రోజురోజుకీ మరింత తీవ్రమవు తోందని ఆయన అన్నారు. దీని ఫలి తంగానే అనేక పరిశ్రమలు మూత బడుతున్నాయని ఉద్యో గాలు కోల్పోయి నిరుద్యోగం పెరిగి,ఆర్థిక అసమానతలు పెరిగి తద్వారా తీవ్రవాదం, అరాచకాలు పెరుగు తున్నాయని ఆయన వివరించారు. అదేవిధంగా నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పని ప్రదేశాలలో కార్మికులను కట్టు బానిసలుగా చేయడానికి కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా అమలులోకి తీసుకు వస్తున్నారని ఆయన వివరించారు. దీనికి వ్యతిరేకంగా మే 20 జరుగుతున్న దేశవ్యాప్తపు సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపుని చ్చారు.