YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్దం

సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్దం

హైదరాబాద్
తెలంగాణ ప్రజలకు అరచేతిలో వైకుంఠం అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇచ్చిన గ్యారెంటీలను  ప్రకటించిన హామీలను అమలు చేయమని ప్రశ్నిస్తే ప్రతిపక్ష నాయకుల చావులు కోరుతున్నాడు రేవంత్ రెడ్డి తీరును హెచ్చరిస్తూ బీఆర్ఎస్వి నాయకులు బషీర్బాగ్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్వి నాయకులు నాగేందర్  కోదాటి మాట్లాడుతూ  రజతోత్సవ సభను చూసినప్పటి నుంచి రేవంత్కు నిద్ర పట్టడం లేదు. కళ్లలో, కడుపులో మాత్రమే కాదు నిలువెల్లా విషం నింపుకున్నడు.. కడుపులో పెట్టుకున్న విషాన్ని, ఆపుకోలేక తల తోక లేనటువంటి మాటలు మాట్లాడుతుండని అన్నారు.
15 నెలల పాలనలో ఆగని పథకం ఏదైనా ఉందా నీ ఆరు గ్యారెంటీలు ఏమైనయి, నీ 420 హామీలు ఏమైనయి, ఏడాదిలో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఏమైనయి జాబ్ క్యాలెండర్ ఏమైంది, విద్యార్థులకు విద్యాభరోసా కార్డు ఏమైంది, విద్యార్థినులకు స్కూటీ ఏమైంది, మహిళలకు రూ. 2,500 ఏమైంది, తులం బంగారం ఏమైంది, కౌలు రైతులకు భరోసా ఏమైంది, రూ. 15 వేల రైతు భరోసా ఏమైంది..తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, ఉద్యమం చేసి, రాష్ట్రం ఇచ్చే అనివార్య పరిస్థితిని కాంగ్రెస్కు కల్పించిండు కేసీఆర్ కేంద్రం మెడలు వంచి సాధించిండు కేసీఆర్..రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే నిన్ను రాష్ట్రంలో తిరగనియ్యం ఈ కార్యక్రమంలో  BRSV నాయకులు నితీష్, రాహుల్, అద్వైత్ రెడ్డి, శ్రీకాంత్ రెహమాత్, రాకేష్, తరుణ్ తదితర విద్యార్ధి నాయకులు పాల్గొన్నారు.

Related Posts