
హైదరాబాద్
జనాభా లెక్కల్లో కులగణన చేయాలన్న కేంద్ర నిర్ణయంపై... పలు బీసీ సంఘాలు హైదరాబాద్ లో సంబరాలు చేశాయి. ఆలిండియా ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఛైర్మన్ ఆళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో హైదర్ గూడ కూడలి లో ఉన్న జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీసీ ఆజాద్ ఐకాస ఛైర్మన్ బత్తుల సిద్దేశ్వర పటేల్, ఢిల్లీ లో 22 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు ప్రతిఫలం దక్కిందని ఆళ్ల రామకృష్ణ అన్నారు. దశాబ్దాల నిరీక్షణ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ జాతి గణనలో కుల గణన చేస్తామని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రక్రియను ఎలాంటి అవకతవకలకు తావు ఇవ్వకుండా వేగవంతం చేయాలని మోదీకి విజ్ఞప్తి చేశారు.