
విజయవాడ, మే 5,
ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం వరకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. మంగళవారం వరకు పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు చెట్ల కిందకు వెళ్లి నిలబడరాదని ఏపీ విపత్తులు నిర్వహణ శాఖ సూచించింది. మరోవైపు రానున్న రెండు రోజులు ఉష్ణోగ్రతలు 41.5 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం , అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆదివారం నాడు మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తిరుపతి మంగనెల్లూరులో శనివారం 42.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. బలమైన ఈదురుగాలులు వీచే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కిందకు వెళ్లకూడదని సూచించారు. నేడు కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 41-42.5°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందని, ఎండల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. విశాఖ, అల్లూరి, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు విజయవాడ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ ఈదురు గాలులు, ఉరుములతో వర్షం కురుస్తోంది. వాతావరణం చల్లగా మారడంతో సేదదీరుతున్నారు నగర ప్రజలు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
రెడ్ అలెర్ట్...
5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారరు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్. ప్రకాశం,కృష్ణా,బాపట్ల, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పారు. పిడుగులు కూడా పడొచ్చు. గంటకు 60-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఇక అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు
కురవొచ్చు. విశాఖ, కాకినాడ, కోనసీమ పరిసర జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదని సూచించారు. ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయంది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 60-85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయంది.ఇక అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. ఈ జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. విశాఖ, కాకినాడ, కోనసీమ పరిసర జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వానలు పడతాయంది.ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదని చెప్పింది. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.