YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పాత్రికేయుడు ఆదిరాజు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

పాత్రికేయుడు ఆదిరాజు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
తొలితరం తెలంగాణ ఉద్యమ కారుడు, ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్టు ఆదిరాజు వెంకటేశ్వర రావు మరణం పట్ల సిఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన ఎంతో పోరాడారని, పత్రికా-సాహితీ రంగానికి విశేష సేవలు అందించారని ఆయన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఖమ్మం జిల్లా పండితాపురానికి చెందిన ఆదిరాజు వెంకటేశ్వర్ రావు 1969 ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. అనేక పుస్తకాలు రచించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన క్రియాశీల పాత్రను గుర్తించి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు విశిష్ట పురస్కారం అందించింది.

Related Posts