YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రెండు ప్రత్యేకతలతో మహానాడు

రెండు ప్రత్యేకతలతో మహానాడు

కడప, మే 6, 
తెలుగుదేశం పార్టీ(  పెద్ద పండుగ మహానాడుకు రంగం సిద్ధం అయ్యింది. టిడిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి పెద్ద పండుగగా నిలుస్తోంది మహానాడు. నందమూరి తారక రామారావు పుట్టిన రోజు నాడు… మూడు రోజులపాటు మహానాడు జరుపుకోవాలని ఆనవాయితీగా వస్తోంది. కోవిడ్ సమయంలో మాత్రం ఆన్లైన్ విధానంలో సైతం ఈ వేడుకను జరుపుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా మహానాడుకు అత్యంత ప్రాధాన్యమిస్తూ వచ్చారు. ఈ ఏడాది కడపలో మహానాడు నిర్వహణకు నిర్ణయించారు. అందుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఊపుతో ఉన్న టిడిపి మహానాడు పండుగకు రెట్టింపు ఉత్సాహంతో సిద్ధమైంది.అయితే ఈసారి నిర్వహించే మహానాడుకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయని టిడిపి నేతలు చెబుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబుకు 75 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో జరుగుతున్న మహానాడు కావడం పార్టీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మరోవైపు కూటమి సర్కార్కు బలమైన మద్దతు దక్కడం.. మరోసారి టిడిపి కూటమికి అవకాశం ఉంటుందన్న వార్తల నేపథ్యంలో.. మహానాడుకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అందుకే చిరకాల ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో మహానాడు ను ఘనంగా జరుపుకోవాలని టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి. టిడిపి చరిత్రలోనే కడపలో మహానాడు నిర్వహించడం ఇదే తొలిసారి. కడపలో సైతం టిడిపి కూటమి.. ఏడు స్థానాల్లో విజయం సాధించి తొలిసారిగా అక్కడ ఆధిపత్యం ప్రదర్శించింది.సాధారణంగా కడప అంటేనే వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి పెట్టని కోట. దశాబ్దాలుగా అక్కడ ఆ కుటుంబ హవా నడుస్తూ వస్తోంది. టిడిపి ఆవిర్భావ సమయంలో సైతం అక్కడ ఆ కుటుంబం సత్తా చాటింది. ఉమ్మడి ఏపీలో అన్ని జిల్లాలను టిడిపి శాసించింది. కానీ కడప విషయానికి వచ్చేసరికి మాత్రం అటువంటి పరిస్థితి ఉండేది కాదు. దానికి కారణం వైయస్ రాజశేఖర్ రెడ్డి. అందుకే ఇప్పుడు ఆ జిల్లా విషయంలో వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకూడదని టిడిపి భావిస్తోంది. పట్టు బిగించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఆ జిల్లాలో మహానాడు నిర్వహిస్తోంది.ఈ నెల చివర్లో మూడు రోజులపాటు మహానాడు కడపలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లలో టిడిపి నేతలు నిమగ్నమయ్యారు. గతంలో జిల్లా నేతలకు ఆ బాధ్యతలు అప్పగించేవారు. కానీ ఈసారి అటువంటి పరిస్థితి లేకుండా రాష్ట్రస్థాయి నాయకులు పర్యవేక్షిస్తున్నారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఇతర ముఖ్య నేతలు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతాన్ని మహానాడు వేదికగా ఎంపిక చేశారు. రాయలసీమ నేతలంతా మహానాడు పై దృష్టిపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు కడప రానున్నారు. అయితే రాయలసీమలో భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధికారంలో ఉండడంతో సునాయాసంగా ఏర్పాట్లు చేయగలుగుతున్నారు.

Related Posts