YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏడేళ్ల తర్వాత డీఎస్సీ

ఏడేళ్ల తర్వాత డీఎస్సీ

విజయవాడ,మే 7, 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16 వేలకు పైగా ఉపాధ్యాయ కొలువుల భర్తీకి గత నెలలో మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ త్వరలోనే ముగియనుంది. మే 15వ తేదీతో ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. మరోవైపు జూన్‌ 6 నుంచి ఆన్‌లైన్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వెలువడిన అతి పెద్ద డీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇదే కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు పోస్టులకు పోటీపడనున్నారు. మొత్తం 16,347 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్నారు. 1994 నుంచి 2018 వరకు తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ హయాంలో స్పెషల్, లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్లతో కలిపి మొత్తం 13 డీఎస్సీల ద్వారా ఏకంగా 1.8 లక్షల మంది ఉపాధ్యాయుల నియామకాలను పూర్తి చేశారు.ఏపీలో చివరిగా 2018లో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆ తర్వాత ఒక్క నోటిఫికేషన్‌ కూడా వెలువడక పోవడంతో దాదాపు ఏడేళ్లుగా అభ్యర్థులు నోటిఫికేషన్‌ కోసం పడిగాపులు కాశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించేందుకు గతేడాది అక్టోబరులో టెట్‌ కూడా నిర్వహించింది. ఇక 2024 నవంబరులోనే డీఎస్సీ సిలబస్‌ కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే డీఎస్సీ ప్రకటన జారీ చేయవల్సి ఉండగా.. ఎస్సీ ఉపవర్గీకరణ అమలు నేపథ్యంలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలలో జాప్యం నెలకొంది. ఎస్సీ వర్గీకరణ గత నెలలో పూర్తి కావడంతో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అలాగే స్పోర్ట్స్‌ కోటాను 3 శాతానికి పెంచడమే కాకుండా 421 పోస్టులకు తాజాగా డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేశారు.మొత్తం పోస్టుల్లో జిల్లా స్థాయిలో 14,088 పోస్టులు, రాష్ట్ర, జోనల్‌ స్థాయిలో 2,259 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తులు, పురపాలక, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువెనైల్‌ సంక్షేమ పాఠశాలల్లోని ఖాళీలకు జిల్లా స్థాయిలో నియామకాలు చేపట్టనున్నారు. అన్ని రకాల ఎస్జీటీ పోస్టులు 6,599 పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్లు 7,487 పోస్టులు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు 14,088 పోస్టులు ఉన్నాయి. ఇక రాష్ట్ర స్థాయి పోస్టులు 259 ఉన్నాయి. జోన్‌ 1లో 400, జోన్‌ 2లో 348, జోన్‌ 3లో 570, జోన్‌ 4లో 682 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో మొత్తం 13,192 ఖాళీలు ఉన్నాయి. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 881, జువెనైల్‌ పాఠశాలల్లో 15, రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసే బధిరులు, అంధుల పాఠశాలల్లో 31 పోస్టులు ఉన్నాయి.

Related Posts