YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బీజేపీ, జనసేనలతో కూటమా...

బీజేపీ, జనసేనలతో కూటమా...

విజయవాడ, మే 7, 
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బీజేపీ కేంద్ర నాయకత్వం పెద్ద బాధ్యతలను అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. జనసేనలో ఉన్నప్పటికీ బీజేపీ పెద్దలు పవన్ పై ఎన్నో ఆశలు పెంచుకున్నారు. ముఖ్యంగా దక్షిణాదిన పవన్ కల్యాణ్ ను వచ్చే ఎన్నికల నాటికి ఉపయోగించుకోవాలని కేంద్ర నాయకత్వం భావిస్తుంది. దక్షిణాదిన బీజేపీకి సరైన ఇమేజ్ ఉన్న నేతలు లేరు. కర్ణాటకలో యడ్యూరప్ప మొన్నటి వరకూ ఉన్నా ఆయన రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకున్నారు. ఇక కర్ణాటకలో బీజేపీకి సరైన నేత లేరు. తమిళనాడు లోనూ బీజేపీని గెలిపించగల లీడర్ అంటూ కరువయ్యారు. కేరళ రాష్ట్రంలోనూ అదే పరిస్థితి. తెలంగాణలో నేతలు బలంగా ఉన్నప్పటికీ ఇమేజ్ ఉన్న నాయకుడు లేరు. ఆంధ్రప్రదేశ్ లోనూ సరైన నాయకత్వం లేదు. క్రౌడ్ పుల్లర్ లీడర్... అయితే దక్షిణాది రాష్ట్రంలో క్రౌడ్ పుల్లర్ గా ఒక నేత కావాలని బీజేపీ భావిస్తుంది. అందుకు పవన్ కల్యాణ్ ను ఎంచుకుంది. దక్షిణాదిన పవన్ చరిష్మాను ఉపయోగించుకోవాలని బీజేపీ బలంగా భావిస్తుంది. జనసేనలో ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ బీజేపీ కేంద్ర నాయకత్వం మాట జవదాటరు. వారిని కాదని పవన్ కల్యాణ్ ముందుకు అడుగు కూడా వేయరు. పవన్ కల్యాణ్ కు కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం అంతే ప్రాధాన్యత ఇస్తుంది. ఢిల్లీకి తరచూ వెళ్లకపోయినప్పటికీ మోదీ, అమిత్ షాలు ఆయనతో టచ్ లో ఉంటారు. పవన్ కల్యాణ్ కూడా సనాతన ధర్మం నినాదం ఎత్తుకోవడం వెనక బీజేపీ డైరెక్షన్ ఉందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. హిందూధర్మాన్ని ఆయన భుజానకెత్తుకున్నారు.. ఇక మోదీ ఇక్కడకు వచ్చినా, పవన్ కల్యాణ్ మోదీ సభకు వెళ్లినా పవన్ కల్యాణ్ ను ప్రత్యేకంగా పలకరిస్తారు. ఆయనకు ప్రత్యేకించి గౌరవం ఇవ్వడం వెనక కూడా ఇదే అంటున్నారు. తాజాగా అమరావతి రాజధాని పనుల పునర్నిర్మాణ శంకుస్థాపన సందర్భంగా జరిగిన సభలోనూ పవన్ కల్యాణ్ ను మోదీ ప్రశంసలతో ముంచెత్తారు. అంతేకాదు పవన్ కల్యాణ్ పై ప్రత్యేకంగా ఆప్యాయతను ప్రదర్శించారు. చాక్లెట్ ఇచ్చారని కొందరు విమర్శలు చేస్తున్నప్పటికీ పవన్ కల్యాణ్ ను సోదరుడుగా సంభోదిస్తూ మోదీ చేసిన ప్రసంగంతోనే ఆయనకు ఇచ్చిన విలువ అర్థమవుతుంది. మోదీ పవన్ కల్యాణ్ ను యువనేతగా అభివర్ణిస్తూ జనసేన క్యాడర్ కు మంచి కిక్కు అందించారు. వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. అక్కడ పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది. అయితే అక్కడ బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు పవన్ కల్యాణ్ ను ఉపయోగించుకోనుంది. పవన్ కల్యాణ్ కు కీలక బాధ్యతలను అప్పగించే యోచనలో కేంద్ర నాయకత్వం ఉంది. రానున్న తమిళనాడుతో పాటు భవిష్యత్ లో కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లోనూ పవన్ సేవలను ఉపయోగించుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. మొత్తం మీద బీజేపీ పవన్ కల్యాణ్ కు ఇస్తున్న ప్రయారిటీ చూసి కూటమిలోని కొందరు నేతలకు కన్ను కుడుతున్నా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు.

Related Posts