
న్యూఢిల్లీ
భారత ఆర్మీ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' లో ఇప్పటివరకు 30 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. బహవల్పూర్ లోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ హెడ్ క్వార్టర్, జైషే మహమ్మద్ కు చెందిన మదర్సాలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆర్మీ మెరుపు దాడి చేసింది. దీంతో అక్కడ 30 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఇదే విషయాన్ని పాక్ మీడియాలో ధ్రువీకరించినట్లు తెలుస్తోంది.