YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రం ఒక గొప్ప నాయుకుడిని కోల్పోయింది

రాష్ట్రం ఒక గొప్ప నాయుకుడిని కోల్పోయింది

రాయచోటి
రాష్ట్రం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని, రాయచోటి టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ రాయుడు మరణం టిడిపి కి, జిల్లా ప్రజలకు తీరని లోటు అని మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. వారు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణానికి చేరుకుని టిడిపి సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ రాయుడు భౌతిక గాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాలకొండ రాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కేవలం ప్రజల కోసమే సుగవాసి పాలకొండ రాయుడు తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి గొప్ప వ్యక్తిని అన్నారు. నాలుగు శతాబ్దాలుగా రాజకీయ జీవితం అనుభవించిన గొప్ప నాయకుడు పాలకొండ రాయుడు అని అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ప్రజల కు సేవలందించారనీ గుర్తు చేశారు. ప్రజల కోసమే మొదటినుంచి తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి పాలకొండ రాయుడు అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు పాలకొండ రాయుడు కుటుంబాన్ని పరామర్శించడం జరిగిందన్నారు. టిడిపి తరపున, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ల తరుపున పాలకొండ రాయుడు మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నామన్నారు. పాలకొండ రాయుడు కుటుంబానికి ఎల్లప్పుడూ టిడిపి అండగా ఉంటుందని మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు వల్ల శ్రీనివాసరావు లు తెలిపారు.

Related Posts