
ఇస్లామాబాద్
భారత్ తో యుద్ధం వేళ పాక్ లో భూకంపం చోటుచేసుకుంది. రాత్రి 1.44 గంటలకు భూప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 4 మ్యాగ్నిట్యూడ్గాగా నమోదైనట్లు వెల్లడించింది. భూకంపం వల్ల ఏదైనా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందా? అన్నదానిపై సమాచారం తెలియాల్సి ఉంది. ఇక ఉగ్రవాదంపై భారత్ పోరాడుతుంటే దాడికి దిగిన పాక్పై ప్రకృతి కూడా కన్నెర్రజేస్తోందని నెటిజన్లు అంటున్నారు