
రంగారెడ్డి
హైదరాబాద్ శంషాబాద్ అంతర్జా తీయ విమానాశ్రయంలో అధికా రు లు భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఐఎస్ఎఫ్ బలగాల పర్యవేక్షణను పెంచారు. 24 గంటల పాటు డేగ కళ్లతో ఎయిర్పోర్టుకి భద్రత కల్పి స్తున్నారు. స్థానిక శాంతి భద్రతల విభాగం, ఇంటెలి జెన్స్,ఎస్బీ పోలీ సుల సమన్వయంతో విమానాశ్ర యానికి భద్రత కల్పించారు. ఎయిర్పోర్టు చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవే క్షిస్తు న్నారు.ప్రయాణికులు 3 గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని అధికా రులు సూచించారు.పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలతో ప్రయాణికుల ను అధికా రులు క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నా రు.శంషాబాద్ విమానాశ్రయం నుం చి జోధ్పుర్, శ్రీనగర్, అమృత్సర్, చండీగఢ్, రాజ్కోట్ వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేశారు. మరో వైపు శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. విమానాశ్ర యంలో బాంబు పెట్టిన ట్లు మెయిల్ ద్వారా సమాచారం అందింది. అప్రమత్త మైన పోలీసు లు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది డాగ్, బాంబ్ స్క్వాడ్తో విమానాశ్రయం లో తనిఖీలు చేపట్టింది. ఈ ఘటన అనంతరం భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.