
హైదరాబాద్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు భారత రక్షణ నిధికి తాను ఒక నెల జీతం ఇస్తున్నట్లు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. తనతోపాటు శాసనమండలి వైస్ చైర్మన్, శాసనమండలి సభ్యులను కూడా భారత రక్షణ అనేది ఒక నెల వేతనాన్ని ఇవ్వాలని ఆయన కోరారు.
పహల్గామ్ లో టూరిస్టులపై ఉగ్రవాదుల నరమేధం తర్వాత భారత రక్షణ దళాలు చేపట్టిన అన్ని చర్యలను తమ సమర్థిస్తూ ఏకీభవిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే పూర్తిస్థాయి యుద్ధం జరిగేటట్లుగా కనబడుతుందని ఆయన చెప్పారు భారత్ పాకిస్తాన్ పై ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం భారత పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం విశారకరమన్నారు. ఇది యుద్ద నీతి కూడా కాదని ఆయన పాకిస్తాన్ చర్యలను తీవ్రంగా ఖండించారు. పాక్ ఆక్రమించే కాశ్మీర్ ను పూర్తిగా స్వాధీనం చేసుకుని భవిష్యత్తులో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడం లక్ష్యంగా తీసుకుంటున్న భారతీయులను రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దేశానికి అండగా నిలవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. పాకిస్తాన్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకుంటున్న ప్రతి చర్యలను తాము పూర్తిగా సమర్థించడంతోపాటు దేశానికి రక్షణ వ్యవస్థకు అండగా నిలబడతామని ఆయన స్పష్టం చేశారు.