
హైదరాబాద్
పాకిస్తాన్ దుశ్చర్యను నిరసిస్తూ హైదరాబాద్ అంబర్పేట లోని పూలే విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీలో రాజ్యసభ మాజీ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీకాంత్ గౌడ్, లక్ష్మణ్ యాదవ్, ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గోన్నారు.
హనుమంతరావు మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతో పోరాటం చేస్తున్న భారత సైన్యానికి మరింత ఆత్మస్థైర్యాన్ని అందించాలి. భారత సైన్యాం చేపట్టే ప్రతి చర్యకు భారత ప్రజలు అండగా నిలుస్తారు. భారత ప్రధాని చేపట్టిన సింధూర్ ఆపరేషన్కు యావత్ భారత్ ప్రజలు అండగా నిలుస్తారు. పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పాలి. యువతను పెడదోవ పట్టిస్తున్న పాకిస్తాన్ కు బుద్ధి మారే వరకు ఈ ఆపరేషన్ కొనసాగాలని అన్నారు.