YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మన మధ్యనే దేశద్రోహులు... సిరాజ్, సమీర్, జ్యోతి...

మన మధ్యనే దేశద్రోహులు... సిరాజ్, సమీర్, జ్యోతి...

హైదరాబాద్, మే 21, 
ఒకడేమో దేశంపై కుట్ర చేశాడు. మానవ బాంబులను ఉపయోగించి వీలైనంత మందిని హతమార్చేందుకు ప్లాన్‌ చేశాడు. మరొకడు యాంటీ ఇండియా గ్రూపులో చేరి దేశంపై సైబర్‌ వార్‌కు దిగాడు. మరో కిలాడీ లేడీ.. యూట్యూబర్‌ ముసుగులో దేశ రహస్యాలను శత్రు దేశానికి అమ్మేసింది. ఇలాంటి 17 మంది దేశద్రోహులను గుర్తించిన పోలీసులు.. మిగిలిన వారి జాడ వెలికితీసే పనిలో పడ్డారు. అయితే కరుడు గట్టిన ఈ ద్రేశద్రోహులను.. శుద్ధపూసలని చెబుతున్నారు వారి కుటుంబ సభ్యులు.హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర చేసిన కేసులో సిరాజ్‌, సమీర్‌ అనే యువకులను అరెస్ట్‌ చేసిన ఎన్‌ఐఏ అధికారులు వారినుంచి ఉగ్ర సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. పేలుళ్ల కుట్రపై దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐసిస్‌ భావజాలానికి ఆకర్షితులై పేలుళ్లకు సిద్ధపడ్డారు సిరాజ్‌, సమీర్‌. తన ఉనికిని చాటుకునేలా జనసాంద్రత ఎక్కువగా ఉన్నచోట భారీ పేలుళ్లకు కుట్ర చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరిస్తున్నారు ఎన్‌ఐఏ అధికారులు. అయితే ఇంత జరుగుతున్నా కూడా తన తమ్ముడు అమాయకుడని చెబుతోంది సమీర్‌ సోదరి ఆలియా. అతడికి లిఫ్ట్‌ను రిఫేర్‌ చేయడంతో తప్ప మరో విషయం తెలియదని వాపోతోంది.మరోవైపు వీడియోల మాటున విదేశీ గూఢచర్యం చేస్తూ పట్టుబడింది జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్‌. పాక్ ఏజెంట్లతో డీల్స్ కుదుర్చుకుని దేశ రహస్యాలను అమ్మేసింది. ఈమె కేసును విచారించే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెహల్గామ్ ఘటన వెనుక కూడా ఈమె హస్తం ఉందన్న అనుమానాలు బయటపడుతున్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో సబ్‌ స్క్రైబర్స్‌నే కాదు పుట్టిన నేలనూ, కన్నవారినీ అడ్డంగా, నిలువునా మోసం చేసింది ఈ దేశద్రోహి. అయితే ఇంత చేసినా తన కుమార్తెపై ఇసుమంతైనా అనుమానం రాలేదంటున్నాడు ఆమె తండ్రి హరీష్‌. ఆమె ఢిల్లీ వెళ్లి వస్తున్నట్టు తనకు తెలుసు తప్ప.. పాకిస్తాన్‌కు వెళ్లిన విషయమే తనకు తెలియదంటున్నాడు.జ్యోతి, సమీర్‌, సిరాజ్‌లే కాదు నిత్యం మనతోనూ ఉండి మనపైనే కుట్రలు చేస్తున్నారు అనేక మంది దేశద్రోహులు. మన మధ్యనే మన చుట్టూ ఉంటూ.. నిశ్శబ్దంగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నారు. అయితే అదను చూసి దేశంపై దాడికి దిగుతున్నారు. ఇదే క్రమంలో సైబర్‌ టెర్రరిస్ట్‌గా మారిన జాసిమ్‌ అన్సారీ అనే వ్యక్తిని గుజరాజ్‌ ఏటీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆపరేషన్ సింధూర్‌ సమయంలో యాంటీ ఇండియా గ్రూపులో చేరి ప్రభుత్వ వెబ్‌సైట్ల్‌పై సైబర్‌ దాడులు చేశాడు ఈ దేశద్రోహి. ప్రస్తుతం ఇలాంటి ద్రోహుల జాడ కనిపెట్టే పనిలో పడ్డాయి భద్రతా దళాలు. శత్రుదేశంతో చేతులు కలిపి దేశంలో కుట్రలు చేస్తున్న ఇలాంటివారిని వలవేసి పట్టుకుంటున్నారు.

Related Posts