YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రేవంత్ కాళ్లకు మొక్కిన ఐఏఎస్

రేవంత్ కాళ్లకు మొక్కిన ఐఏఎస్

హైదరాబాద్, మే 21 
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అచ్చంపేటలో పర్యటించారు. అక్కడ ఓ సభలో ప్రసంగించారు. ఆ సమయంలో ఐఏఎస్ అధికారి డా. ఎ. శరత్ ఆయన కాళ్లు మొక్కారు. ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  అచ్చంపేటలోని అమ్రాబాద్‌ మండలం మాచారంలో ఇందిర సౌర గిరి జల వికాసం పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించిన సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఓ ప్రభుత్వ ఆయన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్ననగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా పని చేస్తున్న ఐఏఎస్ ఏ.శరత్ ఆయన కాళ్లు మొక్కారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇక్కడ ఐఏఎస్‌ కాళ్లు మొక్కిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గమనించనట్టు తెలుస్తోంది. కానీ సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో సదరు ఐఏఎస్‌ అధికారిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.ఐఏఎస్ అధికారి శరత్ వ్యవహారం వివాదాస్పదం అయింది. దీంతో తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సీరియస్ అయ్యారు. ప్రభుత్వ అధికారులందరికీ కీలక సూచనలు చేస్తూ సర్క్యులర్ పంపించారు. ప్రభుత్వ సమావేశాల్లో కానీ.. ప్రజా సమావేశాల్లో కానీ అధికారులు ఎవరూ అనుచితంగా ప్రవర్తించవద్దని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని  హెచ్చరారు. 1968 ఏఐఎస్ రూల్స్ కు అనుగుమంగా మసలుకోవాలన్నారు.  అధికారుల ప్రవర్తన ప్రజల్లో నమ్మకం పెరిగేలా ఉండాలి కానీ.. తగ్గేలా ..నవ్వుల పాలయ్యేలా ఉండకూడదన్నారు. ఏఎస్ అధికారులు రాజకీయ నాయకులతో ఉన్నపుడు బాధ్యతగా వ్యవరించాలి అంటూ తెలంగాణ సీఎస్ రామకృష్ణ మండిపడ్డారు. ఐఏఎస్ అధికారులు ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించకూడదని.. ప్రజా సమావేశాల్లో పాల్గొన్నప్పుడు అనుచిత ప్రవర్తన మానుకోవాలని అన్నారు. ఐఏఎస్ అధికారులే ఇలా ప్రవర్తిస్తే ప్రజల్లో అధికారుల పట్ల ఉన్న నమ్మకం తగ్గుతుందని ప్రభుత్వం హెచ్చరించింది. అధికారి ఎల్లప్పుడు పరిపూర్ణ నిజాయితీతో ఉండాలని సూచించింది.
ఇకపై ఇలాంటి చర్యలు జరిగే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. ఐఏఎస్ అధికారుల అనుచిత ప్రవర్తనపై క్రమశిక్షణ చర్యలు తప్పవని..ప్రజల్లో గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే అధికారుల తీరు మారాలని సీఎస్ చాలా గట్టిగా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా 1964 తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్ అతిక్రమించొద్దు అని ఆదేశాలు జారీ చేసింది. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ .. కలెక్టర్ల కార్యాలయాలను ప్రారంభించడానికి వెళ్లినప్పుడల్లా  అక్కడి అధికారులు కేసీఆర్ కాళ్లకు మొక్కేవారు. ఐఏఎస్ అధికారులు పూర్తి స్థాయిలో గౌరవాన్ని కోల్పోతున్నారన్న విమర్శలు అప్పట్లో వచ్చేవి. అయితే ఇలా చేయవద్దని అప్పట్లో ప్రబుత్వం కానీ.. ఇంకెవరూ కానీ ఆదేశించలేదు. కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఐఏఎస్ శరత్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసి.. అధికారులంతా రూల్స్ పాటించేలా చూడాలని.. సీఎస్ కు సూచించినట్లుగా తెలుస్తోంది. అందుకే సీఎస్ ప్రత్యేకంగా అధికారులకు సందేశం పంపారని అంటున్నారు.

Related Posts