
విజయవాడ, మే 29,
టీడీపీ. అది కరుడుగట్టిన పసుపు కార్యకర్తల సమూహం. ఎన్టీఆర్ నుంచి ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్ వరకు అందరి అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఉంటారు. అదంతా కరుడు గట్టిన బ్యాచ్. పవర్‌లో ఉన్నా లేకున్నా పార్టీ కోసమే పని చేసే వాళ్లుంటారు. అలాంటప్పుడు టీడీపీలో కోవర్టులు ఎవరు అన్నది హాట్ టాపిక్ అవుతోంది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ పొలిటికల్ సెన్సేషన్ అవుతున్నాయి. టీడీపీలో వైసీపీ కోవర్టులు ఉన్నారన్న బాబు..తమతో ఉంటూ వాళ్ల శత్రువులను ఎలిమినేట్ చేస్తున్నారని ఫైరవుతున్నారు చంద్రబాబు. కోవర్టులను టీడీపీలోకి పంపి ఆ కోవర్టుల ద్వారా మీ ఎజెండా అమలు చేయాలనుకుంటే అది సాధ్యం కాదంటూ స్ట్రేయిట్ ఫార్మార్డ్‌గా వార్నింగ్ ఇచ్చారు.మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు చేసిన సంచలన వ్యాఖ్యలపై అటు టీడీపీలో, ఇటు వైసీపీలో చర్చనీయాంశం అయ్యాయి. ఎవరైనా పదవి కోసం వస్తారు. ఆస్తులు కాపాడుకోవడం వస్తారు. అధికార పార్టీలో ఉండాలన్న ఆశతో జంపింగ్ చేస్తారు. కానీ పగ కోసం పార్టీ మారడం కొత్త ట్రెండా అన్న డిస్కస్ జరుగుతోంది. చంద్రబాబు చెప్పింది కాస్త పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలాగే అనిపించినా.. ఏపీలో ఇప్పుడేది సీన్ నడుస్తోందట. అందుకే కోవర్టుల విషయంలో సీఎం చంద్రబాబు చాలా సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారని చర్చించుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని ఘటనలే చంద్రబాబు వ్యాఖ్యలకు కారణమట.ఒంగోలు, మాచర్లలలో జరిగిన హత్యలు కోవర్టుల ప్రమేయంతో జరిగాయని భావిస్తోందట టీడీపీ హైకమాండ్. వైసీపీ కుట్ర రాజకీయాల్లో భాగంగా కోవర్టులను టీడీపీలోకి పంపిస్తుందని అనుమానమంటున్నారు. కొందరు వైసీపీ నేతలు ఆయా నియోజకవర్గాల్లో తమ ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు.. ప్రభుత్వం మారగానే టీడీపీలోకి జంప్ అయ్యారని ఆలస్యంగా పసిగట్టారట. రాజకీయ రక్షణ కోసం టీడీపీలో చేరినట్లుగా నటిస్తూ పాతకక్షలు తీర్చుకోవడానికి..అధికార పార్టీగా ఉన్న టీడీపీని అస్త్రంగా వాడుకుంటున్నారనే సమాచారం చంద్రబాబుకు చేరిందంటున్నారు. పైగా టీడీపీ వర్గపోరుతో చంపుకుంటున్నారని వైసీపీ ప్రచారం చేస్తుండటం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించిందట.ఇంటర్నల్ రిపోర్ట్ ఆధారంగానే మహానాడు వేదికగా చంద్రబాబు అలా స్టేట్‌మెంట్ ఇచ్చారని..క్యాడర్‌ను కూడా అలర్ట్ చేశారని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. పల్నాడు జంట హత్యల ఘటన వెనుక వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందనేది టీడీపీ హైకమాండ్ అనుమానమట. పిన్నెల్లి మద్దతుతోనే గుండ్లపాడు హత్యలు జరిగాయని..అధికారం పోవడంతోనే పిన్నెల్లికి సన్నిహితంగా ఉన్న కొందరు వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించి..టీడీపీలో చేరి తమ నేతలను హతమార్చారని మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్లుఅయితే పొద్దుతిరుగుడు పువ్వులతో జాగ్రత్తగా ఉండాలంటూ వైసీసీని వీడి కూటమి పార్టీల్లోకి వస్తున్న నేతల గురించి ఈ మధ్య మంత్రి పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వైసీపీ నేతలకు పోలీసు అధికారులు సహకరిస్తున్నట్టు టీడీపీలో చర్చ జరుగుతోంది. పల్నాడు జిల్లా ఎస్పీ వ్యవహారశైలిపైనా టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు పోలీసు అధికారులు కోవర్టులకు సహకరిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ఫ్యాక్షన్ ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో కోవర్టు రాజకీయాలు ఎక్కువగా జరుగుతున్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు హత్య జరిగాయి. ఆ హత్యలు చేసుకుంది టీడీపీలోని రెండు వర్గాలేనని పోలీస్ అధికారులు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ స్టేట్‌మెంట్లు ఇచ్చుకున్నారు. దీన్ని అస్త్రంగా మార్చుకుని..కూటమి ప్రభుత్వంలో లా ఆర్డర్ దెబ్బతిందని..టీడీపీ హత్యలను ప్రోత్సహిస్తుందని వాయిస్ రైజ్ చేస్తూ వచ్చింది వైసీపీ.అయితే హత్యల విషయంలో డిటేయిల్డ్ రిపోర్ట్ తెప్పిస్తే..హత్యకు పాల్పడ్డ వారంతా టీడీపీలో కొత్తగా చేరిన వారేనని గుర్తించారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిరాగానే.. టీడీపీ కండువా కప్పుకుని సేఫ్‌గా షెల్టర్ పొందడమే కాకుండా..టీడీపీలో ఉన్న తమ నేతలను వైసీపీ వలస నేతలు చంపారని ఆలస్యంగా గ్రహించారట. అందుకే చంద్రబాబు ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారని..కోవర్టుల విషయంలో పార్టీలో ఇంటర్నల్‌గా పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేసిందట టీడీపీ హైకమాండ్.