
కడప, మే 29,
నారా లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించాల్సిన సమయం ఇది అని సన్నిహితులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే లోకేష్ టీం లో ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్న. చంద్రబాబు మాదిరిగానే నమ్మకస్తులైన బృందాన్ని లోకేష్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీలో లోకేష్ కు ప్రమోషన్ ఖాయమా? వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారా? టిడిపిలో సీనియర్లంతా ఇప్పుడు ముక్తకంఠంతో కోరుకుంటున్నది అదే. మహానాడు వేదికగా ప్రసంగిస్తున్న నేతలంతా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే మంచి సమయం అని చంద్రబాబుకు సూచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి నాయకత్వ పరంగా ఎటువంటి లోటు లేదు. అపర చాణిక్యుడిగా పేరొందిన చంద్రబాబు ఉన్నారు. కానీ చంద్రబాబు వయసు 75 సంవత్సరాలు దృష్ట్యా.. నారా లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించాల్సిన సమయం ఇది అని సన్నిహితులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే లోకేష్ టీం లో ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్న. చంద్రబాబు మాదిరిగానే నమ్మకస్తులైన బృందాన్ని లోకేష్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది.వాస్తవానికి టిడిపి ఆవిర్భావ సమయంలో పార్టీలో చంద్రబాబు లేరు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రబాబు టిడిపి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అక్కడకు కొద్ది రోజులకే తెలుగుదేశం పార్టీలో చేరారు. 1985 మధ్యంతర ఎన్నికల్లో టిడిపి తరఫున చంద్రబాబు పోటీ చేయలేదు. కానీ పార్టీలో చేరిన నాటి నుంచి తనదైన ముద్ర వేసుకున్నారు. పార్టీ వ్యవహారాలను చూసుకున్నారు. అదే చంద్రబాబు రాజకీయానికి ప్లస్ గా మారింది. చంద్రబాబు టీం లోకి పూసపాటి అశోక్ గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు, కింజరాపు ఎర్రం నాయుడు, యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నిమ్మకాయల చినరాజప్ప.. ఇలాంటి నేతలంతా చంద్రబాబు సన్నిహితులుగా ముద్రపడ్డారు. చంద్రబాబుతో పార్టీ వీరు రాజకీయంగా ఎదిగారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి వీరికి ప్రాధాన్యత దక్కుతూనే ఉంది. మీరు కూడా చంద్రబాబు నాయకత్వాన్ని మరింత పెంచుకునేలా చేశారు.అయితే ఇప్పుడు లోకేష్ అటువంటి టీం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరో నాలుగు దశాబ్దాల పాటు టిడిపి ఉనికి చాటుకునేలా ప్రణాళికలు వేస్తున్నారు. అందులో భాగంగానే నారా లోకేష్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. అయితే చంద్రబాబుకు మాదిరిగా లోకేష్ కు సైతం వలయంగా ఉండే నాయకత్వం ఇప్పుడు అవసరం. ఇప్పటికే లోకేష్ టీం పటిష్ట దిశగా ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఆ టీం పనిచేసింది. ఆ టీం కు చెందిన కొంతమంది ఎన్నికల్లో పోటీ చేసి చట్టసభలకు ఎన్నికయ్యారు కూడా. అయితే చంద్రబాబు సన్నిహిత నేతల వారసులు కూడా.. లోకేష్ టీంలో ఉండడం విశేషం.వాస్తవానికి శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు తెలుగుదేశం పార్టీకి పటిష్ట నాయకత్వం ఉంది. అయితే రాష్ట్రస్థాయిలో పార్టీని నడపడం, సంక్షోభాలను ఎదుర్కోవడం, చిక్కుముడులను తప్పించడం, కార్యకర్తలకు మార్గదర్శక నిలవడం, అధినేతకు నమ్మకస్తులుగా ఉండేవారే ఈ టీంలో తప్పకుండా ఉంటారు. అయితే అలాంటివారు ఎవరు అన్నది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. శ్రీకాకుళం నుంచి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, గౌతు శిరీష, విజయనగరం నుంచి సుజయకృష్ణ రంగారావు, అదితి గజపతిరాజు… విశాఖ జిల్లా నుంచి గంటా శ్రీనివాస్, చింతకాయల విజయ్, వంగలపూడి అనిత… గోదావరి జిల్లాల నుంచి జ్యోతుల నవీన్, సానా సతీష్, పుట్ట మహేష్ కుమార్ యాదవ్.. కృష్ణాజిల్లా నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్ధ వెంకన్న పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా నుంచి కోడెల శివరాం, కోవెలమూడి రవీంద్ర, పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు.. ప్రకాశం జిల్లా నుంచి దామచర్ల సత్య.. నెల్లూరు జిల్లా నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. రాయలసీమ జిల్లాల నుంచి బైరెడ్డి శబరి, రెడ్డప్ప గారి మాధవి రెడ్డి, పరిటాల శ్రీరామ్, జెసి పవన్ రెడ్డి, అస్మిత్ రెడ్డి వంటి వారు లోకేష్ టీం అని ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.