
విజయవాడ, మే 29,
ఆపరేషన్ వైసీపీ.. అంటే.. వైసీపీని కాపాడుకునే ప్రయత్నం. ఆది నుంచి అన్ని విషయాల్లోనూ పార్టీని అన్ని విధాలా కాపాడుకునే ప్రయత్నం ప్రారంభమైందా? అంటే.. వైసీపీ వర్గాల నుంచి ఔననే సమాధానం వస్తోంది. మద్యం కుంభకోణం కేసు తీవ్రతరం కావడం.. ఇటీవల సీఎం చంద్రబాబు కూడా.. కేంద్రం చెవిలో వేయడం.. ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటివారు.. కూడా చంద్రబాబుకు ఈవిషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న చర్చ సాగుతుండడంతో జగన్ అలెర్టయ్యారన్న సంకేతాలు వస్తున్నాయి. ఒకవేళ ఆయన జైలుకు వెళ్లాల్సి వస్తే.. వెళ్లేందుకు సిద్ధమని ఆయనే స్వయంగా చెప్పారు. ''రండి. విజ యవాడలోనే ఉన్నా.. జైలు కొత్తకాదు.. కేసులు కూడా కొత్తకాదు. రాజకీయాలలో ఉన్నప్పుడు వాటికి భయ పడతామా!'' అని తేల్చి చెప్పారు. ఈ మాట ఆయన నోటి నుంచే వచ్చిందంటే.. `విషయం` ఆయన వర కు చేరిందన్నది పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా ఆయన జైలుకు వెళ్తే... పార్టీని కాపాడేందుకు ఎవరూ లేరు. అమ్మ, చెల్లి కూడా రివర్స్ అయ్యారు.ఈ క్రమంలోనే ముందుగానే పార్టీ విషయంపై అప్రమత్తంగా ఉన్నట్టు తెలుస్తోంది. అదే.. ఆపరేషన్ వైసీపీ అంటున్నారు. పార్టీ పగ్గాలను ఒక `కీలక వ్యక్తి`కి అప్పగించడంతోపాటు.. పార్టీ తరఫున ప్రచారం చేసేందు కు.. ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా.. ఒక `టీం`ను కూడా జగన్ రెడీచేసుకున్నట్టు సమాచారం. అంతేకాదు.. ఇప్పటికే ఆయనకు దూరమైన ఐప్యాక్‌ను కూడా చేరువ చేసుకుంటున్నట్టు తెలిసింది. గతంలో కొందరు ఆయనకు దూరమైనా.. ఇప్పుడు చేరువ చేసుకునేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేసుకునే `మంత్రదండం` సంక్షేమ, పథకాల తాలూకు ఎసెన్స్ తగ్గకుండా.. ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు కూడా జగన్ రెడీ అయ్యారని సమాచా రం. ప్రస్తుతం ఆపరేషన్ వైసీపీపై గత రెండు రోజులుగా జగన్ అంతర్గతంగా చర్చించుకుంటున్నారని.. దీనిలో ఒకరిద్దరు ఢిల్లీకి చెందిన నాయకులు(ఓ కీలక పార్టీ అని ప్రచారం జరుగుతోంది.) కూడా ఉన్నార ని.. సమాచారం. అయితే.. అరెస్టు కాకుండా చర్యలు తీసుకునే ప్రయత్నం మంచిదని.. కొందరు చెబుతున్నారు. సో.. మొత్తానికి ఆపరేషన్ వైసీపీ అయితే.. స్టార్ట్ అయింది. ఇది ఎలాంటి మలుపు తీసుకుంటుంది. ఏమేరకు వైసీపీకి మేలు చేస్తుంది? అనేది చూడాలి.