
మంగళగిరి
మంగళగిరి రూరల్ పోలీసుల ఎదుట విచారణకు సజ్జల భార్గవ్ రెడ్డి హజరయ్యారు. సజ్జల భార్గవ్ రెడ్డి విచారణ నేపథ్యంలో మంగళగిరి పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. మంగళగిరి పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లకు వెళ్లే మెయిన్ గేటును మూసివేసారు. సజ్జల భార్గవ్ రెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.