YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో లేఖల లొల్లి...

తెలంగాణలో లేఖల లొల్లి...

హైదరాబాద్, మే 29, 
తెలంగాణలో లేఖల రాజకీయం నడుస్తోంది. సాధారణంగా అధికార పార్టీలో ఉన్న నేతలకు ప్రతిపక్ష నేతలు బహిరంగ లేఖలు రాస్తుంటారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు ప్రతిపక్ష పార్టీలు ఓపెన్‌ లెటర్స్‌ రాయడం మీడియా హైలెట్‌ అవడం కామన్‌. కానీ తెలంగాణలో ఇప్పుడు నయా ట్రెండ్ నడుస్తోంది.సొంత పార్టీ నేతలే ఆయా పార్టీల అధినేతలకు లేఖలు రాస్తున్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల నేతలు వారి పార్టీలో ఉన్న సుప్రీం నేతలకు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ లేఖల్లో విమర్శల కంటే ఎక్కువగా ఆవేదన, తమకు జరుగుతోన్న అన్యాయంపైనే గళమెత్తున్నారు నేతలు. తమ తమ పార్టీల్లో లోటుపాట్లు, క్యాడర్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ అగ్రనేతలకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు లేఖలు రాస్తుండటం ఇంట్రెస్టింగ్‌గా మారింది.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి, అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖ తెలంగాణలో పాలిటిక్స్‌లో కాక రాజేసింది. డియర్ డాడీ అని సంభాషిస్తూ పార్టీలో జరుగుతున్న విషయాలను అంశాల వారిగా కేసీఆర్‌కు వివరిస్తూ లేఖ రాశారు కవిత. బీఆర్ఎస్‌ రజతోత్సవ సభలో తాను గుర్తించిన విషయాలను పాజిటివ్, నెగెటివ్‌గా క్యాటగరైజ్‌ చేసి మరీ కేసీఆర్‌కు లేఖ రాశారామె. పార్టీలో లోటుపాట్లు, క్యాడర్ చర్చించుకుంటున్న అంశాలను కవిత తన లేఖ ద్వారా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ లేఖ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.కాంగ్రెస్ నేతలు సైతం ఏఐసీసీ పెద్దలకు తరచూ లేఖలు రాస్తుంటారు. ముఖ్యంగా పార్టీ చీఫ్ ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు రాష్ట్ర నేతలు లెటర్లు రాయడం కామనే. లేటెస్ట్‌గా పార్టీ పెద్దలకు తెలంగాణ నుంచి పలువురు నేతలు లేఖలు రాశారట. సీఎం, పీసీసీ చీఫ్‌లను పదే పదే ఢిల్లీకి పిలవడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతల అసహనం వ్యక్తం చేస్తూ ఢిల్లీ పెద్దలకు లేసినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ తీసుకునే నిర్ణయాలు ఆలస్యమైతే పార్టీ ఎలా నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారట.రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, మీనాక్షీ నటరాజన్‌లకు తెలంగాణకి సంబంధించిన పలు అంశాలను లేఖ రూపంలో రాస్తూ మెయిల్ చేసినట్లు పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పార్టీ ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల పార్టీ నేతలు, ఆశావాహులు నిరాశకు గురవుతున్నారని..ఇప్పటిదాకా పదులసార్లు తెలంగాణ నేతలను ఢిల్లీకి పిలిచి మంత్రివర్గాన్ని విస్తరించకపోవడం ఏంటని ప్రశ్నిస్తూ లేఖ రాశారట.పార్టీ కమిటీలను ఆలస్యం చేస్తే గ్రేటర్, స్థానిక ఎన్నికలపై ఎఫెక్ట్ పడుతుందని, ప్రభుత్వం ఏర్పాటై 17 నెలలు దాటినా కార్పొరేషన్ ఛైర్మన్లను ప్రకటించకపోవడం పట్ల కూడా లేఖలో అసంతృప్తి వెళ్లగక్కారట. ప్రభుత్వం ఏర్పాటైన మొదట్లోనే కార్పొరేషన్, నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తే ఇప్పటికి చాలామందికి అవకాశం వచ్చేదని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలకు కూడా రాష్ట్ర బీజేపీ నేతలు తరచూ లేఖలు రాస్తుంటారు. కాకపోతే బీజేపీ నేతలు రాసే లేఖలు బయటికి రావు. అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఒకరి మీద మరొకరు అధిష్టానంకు ఇంటర్నల్‌గా లేఖలు రాసిన సందర్భాలు ఉన్నాయ్.అంతేకాదు ఆయనకు ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తే ఈ నష్టమని..ఈయనకు పదవి కోసం ఆ నష్టమని..అన్నీ లేఖల్లోనే వివరించారట కమలం లీడర్లు. రాజాసింగ్ లాంటి నేతలైతే తాను పార్టీ హైకమాండ్‌కు చెప్పాల్సిన విషయాలను సోషల్ మీడియాలోనే పెడుతున్నారు. మొత్తం మీద తెలంగాణలో అన్ని ప్రధాన పార్టీలలో లేఖాస్త్రం ట్రెండింగ్‌లో ఉంది. అన్ని పార్టీలలో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుంది.

Related Posts